వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్(మ’చిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో కూడిన రాజధాని) ప్రాంతం ప్రస్తుతం ఉన్న సీఆర్ డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలోనే ఉందని… రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఏదైనా. అందుకే జగన్ కూడా మావిగన్ ప్రతిపాదన చేశారని చెబుతున్నారు. అంతేకాదు.. వాస్తవానికి గతంలోనే.. అంటే వైసీపీలో ఉన్నప్పుడే.. ఈ మావిగన్ ప్రతిపాదన వచ్చిందని కూడా వైవీ చెప్పారు. దీనితో అమ రావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సీఆర్ డీఏను ఎందుకు సమర్థిస్తు న్నారన్న ప్రశ్న తెరమీదికి వచ్చింది.
రాజధానిపై దోబూచులు..
అమరావతిని నేరుగా కాదని చెప్పడంతో గత ఎన్నికల్లో వైసీపీకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగానే 151 స్థానాల నుంచి పార్టీ 11 సీట్లకు పరిమితం అయింది. అలాగని అమరావతిని సమర్థించలేని పరిస్థితి వైసీపీలో కనిపిస్తోంది. ఇతర నాయకులు దీనిని సమర్థించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. జగన్ మాత్రం సమర్థించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో అటు అమరావతి కాకుండా ఇటు.. `మావిగన్` అనే ప్రతిపాదనను తెరమీదికి తెచ్చారు. నిజానికి మావిగన్ కూడా అమరావతి రాజధాని పరిధిలోనే ఉందని చంద్రబాబు కూడా పదే పదే చెబుతున్నారు.
అయిన’ప్ప’టికీ.. మావిగ’న్ మాటనే జగ’న్ పఠిస్తున్నారు. ఇక, ఇప్పుడు మావిగన్ కూడా సీఆర్డీఏ పరీధిలోనే వైవీ ఉంటుందా. పనిలో పనిగా ఆయన సీఆర్ డీఏను తాము వ్యతిరేకించడం లేదని అన్నారు. అంటే..పూర్తి స్థాయిలో సీఆర్ డీఏను సమర్థిస్తూనే.. మరోవైపు అమరావతికి వ్యతిరేకంగా మావిగన్ మాటను వినిపిస్తున్నారు. ఈ రెండు నాల్కల ధోరణి రాజకీయంగా వైసీపీని మరింత డైల్యూట్ చేస్తోందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. అయిన’ప్ప’టికీ.. త’మ పంతం త’మదే అన్నట్టుగా వైసీపీ ముందుకు సాగుతోంది. అమరావతిని నేరుగా సమర్థిస్తే.. అది చంద్రబాబును ప్రత్య క్షంగా, పరోక్షంగా సమర్థించినట్టే అవుతుందన్నన జగన్‌లో ఉంది. అందుకే ఆయన అమరావతిని వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు.
ఎన్నికల నాటికి ఈ మాట కూడా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలే కాదు.. దేశం మొత్తం అమరావతిని అంగీకరించినని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ వాదనను కాదని జగన్ ముందుకు సాగితే.. అది ఆయనకు డ్యామేజీ ని మరింత పెద్దది చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నెమ్మదిగా మావిగన్.. సీఆర్డీఏ పరిధిలోనే ఉందన్న వాదనను తన వారితో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఎన్నిక ల నాటికి ఈ విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నా.. ఆశ్చర్యం ఉండక పోవచ్చన్నది విశ్లేషకుల మాట. అయితే.. తమ మేనిఫెస్టోలో సైతం మావిగన్ చేరుస్తామని జగన్ చెప్పిన దరిమిలా.. ఏం జరుగుతుందన్నది చూడాలి. కాల్ వైసీపీ రాజకీయకోణంలో రాజధానిని చూడడం.. దీనిని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేయడం వాటిపై చర్చ జరుగుతూనే ఉండడం గమనార్హం.

