- ప్రధాని మోడీ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం..
- స్వీడన్ అత్యున్నత గౌరవాన్ని స్వీకరించిన ప్రధాని..
- 31వ అంతర్జాతీయ అవార్డు అందుకున్న నరేంద్ర మోడీ..
PM Narendra Modi: ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. ప్రధాని 5 దేశాల పర్యటనలో భాగంగా ఈ రోజు స్వీడర్ చేరారు. ఈ నేపథ్యంలో స్వీడన్ ప్రభుత్వం ప్రధాని మోడీకి అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. ”రాయల్ ఆర్డర్ చేసింది ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్”ను ప్రదానం. ఒక ప్రభుత్వ అధినేతకు లభించే అత్యున్నత గుర్తింపు, గౌరవంగా దీనిని భావిస్తున్నారు.
ప్రధాని మోడీకి 31వ అంతర్జాతీయ పురస్కారం ఇది. భారత్-స్వీడన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం, వివిధ రంగాలలో భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో కృషికి గాను ప్రధానమంత్రి మోదీకి ఈ గౌరవం లభించింది.
అంతకుముందు, 8 ఏళ్ల తర్వాత స్వీడన్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని ఆ దేశం ఘనంగా స్వాగతించింది. స్వీడన్ గగనతలంలో ప్రధాని విమానానికి స్వీడన్ ఫైటర్ జెట్లు ఎస్కార్ట్‌గా వచ్చాయి. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్టర్సన్ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మోడీని ఆహ్వానించడానికి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఎయిర్ పోర్ట్ బయట ప్రవాస భారతీయులు మోడీకి ఘన స్వాగతం పలికారు.
గోథెన్బర్గ్: ప్రధాని నరేంద్ర మోదీకి స్వీడన్ ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్’ను ప్రదానం చేసింది.
ఇది ప్రభుత్వాధినేతకు ఇవ్వబడే అత్యంత గుర్తింపు మరియు గౌరవం. ప్రధాని మోదీకి ఇది 31వ ప్రపంచ గౌరవం.
(మూలం: DD) pic.twitter.com/VB3O5CAn61
– ANI (@ANI) మే 17, 2026

