ఇప్పటికే మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన టీమ్ సారథ్య బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించి తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్మృతి మంధాన స్పష్టం చేశారు. ప్రస్తుత జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్మృతి మంధాన.. గత కొన్నేళ్లుగా హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అనేక సందర్భాల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక కెప్టెన్‌గా భారత జట్టును విజయ పథంలో నడిపించిన అనుభవం స్మృతి మంధానకు ఉంది.
భారత మహిళా జట్టు కెప్టెన్సీ మార్పునకు సంబంధించి వస్తున్న ఊహాగానాలపై స్మృతి మంధానకు ఓ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ భవిష్యత్తులో భారత జట్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా అని అడగగా.. అవును.. నేను దానికి సిద్ధంగా ఉన్నానని స్మృతి మంధాన ఎంతో నమ్మకంతో సమాధానమిచ్చింది. ఎంతో ఒత్తిడితో కూడిన మ్యాచుల్లో కూడా కూల్ గా తీసుకుని జట్టును నడిపించిన అనుభవం కూడా స్మృతి మంధానకు ఉంది. ఆ టాలెంటే స్మృతి మంధానను కెప్టెన్ రేసులో నిలబెట్టింది.
స్మృతి మంధాన కెప్టెన్సీ రికార్డు
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి స్మృతి మంధాన బలమైన పోటీదారుగా నిలిచింది. ఆమె 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు, నాలుగు వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించింది, మొత్తం 15 మ్యాచ్‌లలో జట్టును విజయపథంలో నడిపించింది. ఆమె నాయకత్వంలో ఆడిన నాలుగు వేదికలలోనూ భారత జట్టు అజేయంగా నిలిచింది.
క్రికెట్ మక్కాగా ప్రసిద్ధే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించిన అనంతరం స్మృతి మంధాన ఈ ప్రకటన చేశారు. లార్డ్స్‌లో జరిగిన చరిత్రాత్మక మహిళల టెస్ట్ మ్యాచ్‌లో, భారత జట్టుపై 270 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 170, 186 పరుగులకే ఆలౌట్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నారు.
ప్ర: కెప్టెన్సీ బదిలీపై ఊహాగానాలు ఉన్నాయి – మీరు అడిగితే భారతదేశానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారా? (TOI నుండి గౌరవ్ గుప్తా)
స్మృతి మంధాన “అవును, నేను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది. pic.twitter.com/K4AsrTvc4E
– జాన్స్. (@CricCrazyJohns) జూలై 15, 2026 ">

