హర్మన్‌ప్రీత్ కౌర్ : అసలే ఆదివారం.. అందులోనూ ఆస్ట్రేలియా.. కచ్చితంగా గెలవాలి.. ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీఫైనల్ వెళ్ళిపోయింది.. ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోకుండా ఉంటే టీమ్ ఇండియాకు ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. అందువల్లే ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి.
పైగా బంగ్లాదేశ్ జట్టు మీద దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది. సరిగ్గా సెమీఫైనల్ వెళ్లాలంటే ఆస్ట్రేలియా మీద గెలవాలి. అందువల్లే ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయానికి తగ్గట్టుగానే అత్యుత్తమ బ్యాటర్లు బ్యాటింగ్ చేశారు.
ఓపెనర్లు స్మృతి 38, షఫాలీ 34 పరుగులు చేశారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 66 పరుగులు జోడించారు. ఆ తర్వాత 83 పరుగుల వద్ద టీమ్ ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం కెప్టెన్ కౌర్, జమీమా సూపర్ ఆట తీరు ప్రదర్శించారు. ముఖ్యంగా కెప్టెన్ కౌర్ 27 బంతుల్లోనే 56 పరుగులు చేసింది. ఇందులో ఆరు ఫోర్లు.. మూడు సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా చివరి లో ఓవర్ సోఫీ బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి కౌర్ అదరగొట్టింది. చివరి ఓవర్లో భారత జట్టు ఏకంగా 23 పరుగులు. ఆస్ట్రేలియా ముందు 171 పరుగుల టార్గెట్ విధించింది. కేవలం నాలుగు టికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా ఈ ఘనత అందుకుంది.
కౌర్ ఈ టి20 వరల్డ్ కప్ లో ఇప్పటివరకు తన స్థాయి బ్యాటింగ్ చేయలేదు. కానీ ఆస్ట్రేలియా మీద మాత్రం సింహగర్జన చేసింది. సూపర్ ఆటతీరుతో ఆకట్టుకుంది. జమీమాతో కలిసి మూడో వికెట్ కు ఏకంగా 64 పరుగులు జోడించారు. నాలుగో వికెట్ కు రీఛా తో కలిసి ఐదు బంతుల్లోనే 19 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. అక్కడ టీమ్ ఇండియాను అత్యంత పటిష్ట స్థితిలో నిలిపింది.. చివరి ఓవర్ లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కౌర్.. 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ ఉంది. వేగంగా ఆడే క్యాచ్ అవుట్ అయింది. ఈ హాఫ్ సెంచరీ ద్వారా t20 లలో ఆస్ట్రేలియా మీద కౌర్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా జట్టు మీద మూడు హాఫ్ సెంచరీలు చేసిన కెప్టెన్ గా అవతరించింది.
స్కిప్పర్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధాటిగా అర్ధ సెంచరీతో భారత్‌కు శుభారంభం చేసింది
చూడండి #T20 ప్రపంచకప్ ప్రత్యక్ష ప్రసారం, వివరాలు https://t.co/niBjzedxPu pic.twitter.com/8cgUDS7O0y
— ICC (@ICC) జూన్ 28, 2026

