సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని ఇరిగేషన్ శాఖలో పని చేస్తున్న ఇద్దరు అధికారుల మధ్య గొడవ చినికి గాలివానలా తయారైంది. ఏకంగా అసహనం కోల్పోయి దాడి చేయడానికి తల్వార్ తీసుకొచ్చే వరకు వెళ్లింది. హుజూర్ నగర్ ఇరిగేషన్ ఆఫీసులో ఉద్రిక్త వాతావరణానికి కారణమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
ఇరిగేషన్ శాఖలో డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న వరుణ్.. కొత్త పాస్ ఫోర్ట్ పై అధికారుల పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పాస్ పోర్ట్ అప్లికేషన్ ను అదే శాఖలో ఏఈగా పనిచేస్తున్న జీవన్ కుమార్ ఫార్వర్డ్ చేయడంలేదని వరుణ్ ఆరోపిస్తున్నాడు. అప్లికేషన్ ఫార్వార్డ్ చేయకుండా నిలిపివేస్తున్నాడనే అంశంలో ఇద్దరి నడుమ తీవ్ర వాగ్వివాదం జరిగింది.
ఈ వివాదంలో పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మాట మాట పెరిగి అసహనానికి లోనైన డిఏఓ వరుణ్.. బయటకు వెళ్లి తల్వార్ తీసుకొని వచ్చి ఏఈ జీవన్ కుమార్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకుని ఇద్దరినీ దూరం తీసుకెళ్లారు. 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువురిని పోలీస్ స్టేషన్కు తరలించారు.

