తెలంగాణ:దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ పురస్కారాలకు(పద్మ అవార్డులు) 2026 సంవత్సరానికి సంబంధించి మొత్తం 131 అవార్డులను ప్రదానం చేయడానికి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపింది.ఈ పురస్కారాల్లో 5 పద్మ విభూషణ్,13 పద్మ భూషణ్,113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.
ఇవాళ రాష్ట్రపతి భవన్లో నిర్వహించనున్న తొలి సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము )66 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు.ఈ కార్యక్రమంలో 2 పద్మ విభూషణ్,6 పద్మ భూషణ్,58 పద్మశ్రీ పురస్కారాలు అందజేయనున్నారు.
ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.

