భోజశాల మహా ఆరతి: మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాలలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సుమారు 721 ఏళ్ల తర్వాత శుక్రవారం రోజున భోజ్‌శాల ఆలయంలో మహాహారతి నిర్వహిస్తున్నారు. ధార్ జిల్లాలో ఉన్న ఆ ఆలయంలో ఇన్నాళ్లూ ముస్లింలు నమాజ్ చేశారు.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని భోజ్‌శాలలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సుమారు 721 ఏళ్ల తర్వాత శుక్రవారం రోజున భోజ్‌శాల ఆలయంలో మహాహారతి(భోజశాల మహా ఆర్తి) నిర్వహిస్తున్నారు. ధార్ జిల్లాలో ఉన్న ఆ ఆలయంలో ఇన్నాళ్లూ ముస్లింలు నమాజ్ చేశారు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. భోజ్‌శాల సరస్వతీ దేవి ఆలయమని కోర్టు తన తీర్పులో వెల్లడించిన విషయం గురించి తెలుస్తుంది.భోజ్‌శాల ఆలయ పరిసరాల్లో సుమారు 1800 మంది బలగాలను మోహరించారు. మే 15వ తేదీన తీర్పు వచ్చిన తర్వత అక్క డ తొలి శుక్రవారం కావటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంట ల మధ్య క ట్టుదిట్టమైన భ ద్ర త మధ్య కార్య క్ర మాన్ని నిర్వ హించ నున్నారు. అందులో హైకోర్టు ప్రకారం భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.
ఇవాళ ఉదయం సరస్వతీ దేవికి హారతి నిర్వహించారు. ఇక మధ్యప్రదేశ్ హైకోర్టును సవాల్ చేస్తూ ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కమల్ మౌలా మసీదుకు చెందిన కేర్‌టేకర్ ఖ్వాజి మొయినుద్దీన్ ఆ గుడి ఆవరణలో సంస్కృత భాషలో రాతలు ఉన్నట్లు తేల్చారు. ఓ హవన కుండం, ఆలయ కళావైభవానికి చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు పురావస్తు శాఖ ప్రవేశపెట్టింది.
#చూడండి | మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశానుసారం ధార్‌లోని సరస్వతీ దేవికి అంకితం చేయబడిన భోజ్‌శాల ఆలయంలో ఉదయం హారతి నిర్వహిస్తారు.
కోర్టు ఆదేశాల తర్వాత, భోజ్‌శాల కాంప్లెక్స్‌లో శుక్రవారం నమాజ్‌కు అనుమతి లేదు. pic.twitter.com/2p8XEfOHaf
– ANI (@ANI) మే 22, 2026

