అమరావతి: మహిళలకు టిడిపి ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు సూచించారు. టిడిపి సంప్రదాయ ఓటు బ్యాంక్ ను కాపాడుకోవాలని అన్నారు. చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో భేటీ అయ్యారు. మహానాడు నిర్వహణ ప్రధాన ఎజెండాగా సమావేశం జరిగింది. మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు ఆమోదం. కార్యకర్తే అధినేత అనేది మహానాడులో వినిపించాలని, బిసిల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే సందేశం అందించాలని కార్యకర్తలకు సూచించారు. హైబ్రిడ్‌లో మహానాడును విజయవంతం చేయడానికి చంద్రబాబు నాయుడు విధానం.

