– ప్రకటన –
– ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైన రేవంత్ సర్కార్
– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ – తొగుట : ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగడంతో రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం తొగుట వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. తడిచిన పొద్దు తిరుగుడు ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలల క్రితమే పొద్దు తిరుగుడు ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొచ్చి పోశామని, కొనుగోళ్లు జరగక వానలకు తడుస్తూ ఎండలకు ఎండిపోతూ పంట నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించి చివరికి మార్కెట్ నుంచి బయటకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం అవ సరమైన సంచులు కూడా ప్రభుత్వం అందించడం లేదని, రైతులే బయట నుంచి సంచులు కొనుక్కొస్తేనే కాంటాలు వేస్తున్నారని రైతులు ఎమ్మెల్యేకు విన్నవించారు. రైతులు అరిగోస పడుతున్న ప్రభు త్వానికి చీమకుట్టినట్టూ లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం కెసిఆర్ హయాంలో ఎంత పంట పండిన ప్రభు త్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, నేడు రైతులకు అండగా నిలవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి గా చేతులెత్తేసిందని. రైతు డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు రైతు లు పండించిన ధాన్యాన్ని కూడా కొనలేని దుస్థితికి చేరుకుందని ఏద్దేవా చేశారు. “రైతు ఏడిస్తే రాష్ట్రం బాగుపడదు.. రైతు కన్నీటి మీద కాంగ్రెస్ రాజకీ యాలు ఎక్కువ రోజులు నిలవవు” అని ఎమ్మెల్యే
పాల్గొన్నారు. రెండు రోజుల్లో పొద్దు తిరుగుడు ధాన్యం కొనుగోలు చేయక పోతే పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. గుడికందుల, తొగుట, జప్తి లింగారెడ్డి పల్లి, వెంకట్రావుపేట గ్రామాలలో పలు కుటుంబాలను పరామర్శించా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్య క్షులు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి, సర్పంచ్ రాజిరెడ్డి, బక్క కనకయ్య, నాయకులు బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, చిలువేరి మల్లారెడ్డి, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, నంట పరమేశ్వర్ రెడ్డి, మంగ నర్సింలు, కనకయ్య ఉన్నారు.
– ప్రకటన –

