హైదరాబాద్: కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలంగాణ నలుమూలతో పాటు ఇతర రాష్ట్రాల భక్తుల నుంచి పెద్ద ఎత్తున పుష్కరాలకు తరలివస్తున్నారు. ఈ విధంగానే తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు గురువారం (మే 21) సరస్వతీ అంత్య పుష్కరాల్లో పాల్గొని పుణ్య స్నానమాచరించారు. అనంతరం నదిమ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్ దంపతులు అంతకముందు ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకున్నారు గవర్నర్. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గవర్నర్ దంపతులకు స్వాగం పలికారు.
కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ( మే 21 ) కంచిపీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. ఉదయం 5.43 గంటలకు తొలి పుష్కర స్నానం ఆచరించారు శంకర విజయేంద్ర సరస్వతి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక హరితహారం గోవింద, స్నానమాచరించారు.
మే 21 నుండి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి సరస్వతి అంత్య పుష్కరాలు. పుష్కరాలకు లక్షలాదిగా తరలి రానున్నారు భక్తులు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు అధికారులు. పుష్కరాలు జరిగే ఈ 12రోజుల పాటు కాళేశ్వరంలో ఆధ్యాత్మిక కాంతులతో వెలుగులు విరజిమ్మనున్నాయి..
సరస్వతీనది అంత్యపుష్కరాలలో గోదావరి భాగంగా, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీనదిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటున్నారు.

