– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ హైకోర్టులో ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫొగట్‌కు ఊరట లభించింది. రాబోయే క్రీడల ఎంపిక ట్రయల్స్‌లో ఆమె ఫిట్‌నెస్‌పై నిపుణుల కమిటీ నియమించాలని డబ్ల్యూఎఫ్ఐ(రెస్ట్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా)ని ధ’ర్మస’నం ఎంపిక చేసింది. శుక్రవారం విచారణ సందర్భంగా దేశంలో మాతృత్వాన్ని గౌరవిస్తారని, వేడుకగా జరుపుకుంటారని, కాబట్టి ఇలాంటి పరిస్థితులను న్యాయంగా పరిష్కరించాలని కోర్టు సూచించింది.ఫెడరేషన్‌లోని వివాదాల కారణంగా క్రీడ దెబ్బతినకూడదని కోర్టు హితువు పలికింది.
మే 9న ఫోగాట్‌కు డబ్ల్యూఎఫ్ఐ షో-కాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులతో ఈ వివాదం మొదలైంది. 2024 సమ్మర్ ఒలింపిక్స్ సమయంలో బరువు పరిమితిని అందుకోలేకపోవడం, డోపింగ్ నిరోధక పరీక్షలకు ఆమె కాకపోవటంతో, స్వదేశీ కుస్తీ టోర్నమెంట్లో పాల్గొనకుండా ఫెడరేషన్ ఆమెపై వేటు వేసింది. ఫెడరేషన్ నిర్ణయాన్ని కోర్టులో ఫొగట్ సవాల్ చేసింది. కేసు విచారణ సందర్భంగా నిపుణుల కమిటీ వేసి ఆమె పిటినెస్పై నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.
– ప్రకటన –

