ఏపీతో సహా వివిధ రాష్ట్రాల నుండి 300 మంది ప్రతినిధులు హాజరు
మహాసభలకు సర్వం సిద్ధం
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభలు తిరుపతి నగరంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర మహాసభలతో పాటు 83వ వార్షికోత్సవాన్ని కలిపి ఉన్నారు. నగరంలో సిపిఐ ఉనికిని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ అరసం రాష్ట్ర మహాసభలకు వేదిక. 40 సంవత్సరాల అనంతరం అరసం మహాసభలు మరోసారి తిరుపతిలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సదస్సులు, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుండి 300 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరు అవుతున్నారు. తొలిరోజు శనివారం ఉదయం జరిగే ప్రారంభ కార్యక్రమం వేదికకు శంకరంబాడి సుందరాచారి పేరు ఖరారు చేశారు. ఉదయం 9 గంటలకు హాజరు అయ్యే ప్రతినిధుల నమోదు మొదలవుతుంది. అనంతరం 10:30 గంటల నుంచి 1:00 వరకు ప్రారంభ సమావేశాన్ని నిర్వహించారు. ప్రారంభ సమావేశానికి ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సదస్సు ఆహ్వాన సంఘం అధ్యక్షులు డాక్టర్ సాకం నాగరాజు, జాతీయ సమన్వయకర్త ఆచార్య కె కాత్యాయని విద్మహే, భారతీయ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, విశాలాంధ్ర జనరల్ మేనేజర్ రెడ్డితోపాటు ప్రముఖ రచయితలు వేల్పుల నారాయణ, డాక్టర్ వల్లేరు వీరస్వామి, వల్లూరి శివప్రసాద్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభల ప్రత్యేక సంచిక విశాలాక్షి మాసపత్రికను సంపాదకులు ఈతకోట సుబ్బారావు, సాకం నాగరాజు ఆవిష్కరిస్తారు.
ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు
రెండు రోజులు పాటు తిరుపతిలో జరిగే అరసం మహాసభల ఏర్పాట్లను ఆ సంఘం నాయకులు శుక్రవారం ఉదయం పర్యవేక్షించారు.. ఈ కార్యక్రమంలో అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ అరసం రాష్ట్ర , జిల్లా జిల్లా నాయకులు సాకం నాగరాజు, గంటా మోహన్ డాక్టర్ నెమిలేటి కిట్టన్న, ఆంధ్రప్రదేశ్ శ్రీమన్నారాయణ ఏడుకొండలు ప్రధాన కార్యదర్శి ఇంచార్జి డాక్టర్ ఎండి ప్రసాద్, సత్యాల బాదుల్లా మారింది.
నేటి కార్యక్రమాలు
ప్రారంభ సమావేశం తర్వాత మధ్యాహ్నం నుంచి వివిధ సదస్సులు జరుగుతాయి. విద్వాన్ విశ్వం వేదికపై మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు మొదటి సదస్సు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య వేదికపై నాలుగున్నర నుంచి ఐదున్నర గంటల వరకు రెండవ సదస్సు, గజ్జల మల్లారెడ్డి వేదికపై సాయంత్రం ఐదున్నర గంటలకు నేను- నా పుస్తకం, ఆమె నా సూర్యోదయం, సౌందర్య కోన కవిత సంపుటాలు, నాగలి-నానీలు, రణం నుండి శాంతి వైపు, నారీ బేరి పుస్తకాలను ఆవిష్కరిస్తారు. తొలిరోజు అయిన శనివారం ప్రముఖ రచయితలు ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, నల్లి ధర్మారావు, పేరూరు బాలసుబ్రమణ్యం, ఆచార్య ఈశ్వర్ రెడ్డి, ఆచార్య మధురాంతకం నరేంద్ర, యువశ్రీ మురళి, ఆచార్య కొలకలూరి మధు జ్యోతి, వి ప్రతిమ, పీసీ వెంకటేశ్వర్లు, ఎంఆర్ అరుణకుమారి, పల్లిపట్టు నాగరాజు, డాక్టర్ గంగిశెట్టి శివ ప్రసంగించారు.

