హాయ్ వోల్టేజ్ మ్యాచ్ లో బెంగళూర్ పై హైదరాబాద్ గెలిచి విజయం సాధించింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో 2026 మే 22న జరుగుతున్న మ్యాచ్ లో.. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్.. బెంగళూరు ముందు ఉంచిన 256 పరుగుల భారీ టార్గెట్ ను కాపాడుకుంది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్ ను మాత్రం తప్పించుకోలేకపోయింది. ఆర్సీబీని 160 రన్స్ లోపు కట్టడి చేయలేక మూడో స్థానంలో ఉంటూ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడక తప్పని పరిస్థితి.
లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి బెంగళూర్ 200 రన్స్ మాత్రమే చేసింది. బెంగళూర్ బ్యాటర్లలో కెప్టెన్ రజత్ పటీదార్ సిక్సు, 6ఫోర్లతో (56) హాఫ్ సెంచరీతో గెలిపించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. ఇక వెంకటేష్ అయ్యర్ 44 (4 సిక్సులు, 4 ఫోర్లు), కృణాల్ పాండ్య 41 (5 ఫోర్లు), పడిక్కల్ 21, కోహ్లీ 15 పరుగులు చేశారు.
హైదరాబాద్ బౌలర్లలో రెండు వికెట్లు తీసుకున్న ఇషాన్ మలింగ.. మంచి ఊపుమీదున్న ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (44) ను ఔట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అయ్యర్ తో పాటు పడిక్కల్ ను 21 రన్స్ దగ్గర పెవిలియన్ కు పంపాడు. అంతకు ముందు కోహ్లీని 15 రన్స్ దగ్గర ఔట్ చేశాడు సకీబ్ హుస్సేన్. ఇక ఊపుమీదున్న కెప్టెన్ రజత్ పాటీదార్ ను 56 రన్స్ దగ్గర ట్రావిస్ హెడ్ ఔట్ చేశాడు.
దూకుడుగా మొదలెట్టి ఢీలా పడిన ఆర్సీబీ బ్యాటర్లు:
భారీ టార్గెట్ ఛేదనలో భాగంగా బెంగళూర్ బ్యాటర్లు ఆరంభం నుంచే దాడికి దిగారు. ఈ కావలసిన పవర్ ప్లేలో దూకుడుగా ఆటను కొనసాగించారు ఆర్సీబీ ఓపెనర్స్. కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ పోటాపోటీగా బౌండ్రీలు బాదుతూ మూడు ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 34/0 దాటింది. వెంకటేష్ అయ్యర్ మరీ విధ్వంసకరంగా ఆడుతూ.. 4 ఓవర్లలో వరుసగా 6,4,0,6,6, wd, 0 కొట్టడంతో 4 ఓవర్లలో ఆర్సీబీ స్కోర్ 57/0 కు చేరుకుంది.
ఇక్కడ RCB బ్యాటర్ల స్పీడ్‌కు ఇషాన్ మలింగ బ్రేక్ వేశాడు. వెంకటేష్ క్యాచ్ ఔట్ అవ్వడంతో SRH అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 19 బంతుల్లో 4 సిక్సులు, 4 ఫోర్లతో 44 పరుగులు చేశాడు అయ్యర్. భయంకరంగా మారిన తరుణంలో అయ్యర్ ను ఔట్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు. ఆరంభం నుంచి దూకుడు చూపించిన బెంగళూర్.. ఆ తర్వాత ఢీలా పడింది.
అయ్యర్ అవుటైనా కూడా బెంగళూర్ బ్యాటర్లు స్పీడ్ తగ్గించలేదు. పవర్ ప్లే ముగిసే లోపు స్టార్ బ్యాటర్ కోహ్లీని కూడా వెనక్కు పంపారు హైదరాబాద్ బౌలర్లు. హుస్సేన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ (15) క్యాచ్ ఔట్ అవ్వడంతో బిగ్ రిలీఫ్ దొరికింది. దీంతో 6 ఓవర్లకు RCB స్కోర్ 75/2 కు చేరుకుంది.
ఓపెనర్లు ఔటవ్వడంతో ఊపుమీదున్న కాటేరమ్మ కొడుకులు.. 9వ ఓవర్ లో పడిక్కల్ ఔట్ చేశారు. ఇషాన్ మలింగ బౌలింగ్ లో 14 బంతులలో సిక్సు, 2 ఫోర్లతో 21 రన్స్ చేసిన పడిక్కల్ ఔట్ గా వెనుదిరిగాడు. దీంతో మ్యాచ్ కాస్తహైదరాబాద్ కంట్రోల్ లోకి వచ్చింది.
ఆ తర్వాత బెంగళూరు బ్యాటర్ల స్పీడ్ గా ఆడేందుకు ప్రయత్నించినా హైదరాబాద్ బౌలర్లు అడ్డుకున్నారు. 13 ఓవర్లకు బెంగళూర్ స్కోర్ 127-3 కు చేరుకుంది. ఈ సమయంలో క్రీజులో ఉన్న కృణాల్ పాండ్య (21), రజత్ పాటిదార్ (21) బౌండరీల కోసం విశ్వప్రయత్నం చేశారనే చెప్పాలి.
16 ఓవర్లు వచ్చేసరికి బెంగళూర్ స్కోర్ 160-3 చేరుకుంది. ఆర్సీబీ గెలవాలంటే 24 బంతులలో 96 పరుగులు చేయాలంటే 16వ ఓవర్లో ఇషాన్ మలింగ బౌలింగ్‌లో 4, 5వ బంతులకు వరుస ఫోర్లు కొట్టి కాస్త స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత19వ ఓవర్ 2వ బాల్ కు హెడ్ బౌలింగ్ లో బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇప్పటికే మ్యాచ్ పూర్తిగా SRH చేతుల్లోకి వచ్చేసింది.
మొత్తానికి 55 రన్స్ తేడాతో ఆర్సీబీని ఓడించినా.. 160 రన్స్ లోపే ఔట్ చేయాలనే లక్ష్యం మాత్రం నెరవేరలేదు. దీంతో ఫస్ట్ ప్లేస్ ను అందుకోలేకపోయింది. అలాగే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి సన్ రైజర్స్ ది.
వీరబాదుడు బాదిన కాటేరమ్మ కొడుకులు (SRH):
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక హైదరాబాద్.. బ్యాటర్ల వీరబాదుడుతో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. SRH బ్యాటర్లలో ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 పరుగులు (3 సిక్సులు, 8 ఫోర్లు), అభిషేక్ శర్మ 22 బాల్స్ లో 56 (5 సిక్సులు, 4 ఫోర్లు), క్లాసెన్ 24 బంతులలో 51 రన్స్ (5 సిక్సులు హైదరాబాద్, 2 ఫోర్లు), హెడ్ 26 (16), నితీష్ కుమార్ రెడ్డి భారీ స్కోరు చేయడం.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “SRH vs RCB: బెంగుళూర్పై హైదరాబాద్ సునాయాస విజయం.. కానీ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సిందే !”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

