బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు.“బీఆర్ఎస్లో మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు.. అలాంటి మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతారా ?అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తాం అంటూ ప్రకటించిన హరీష్ రావు గారు.. ఈ భూములను తాకట్టు పెట్టడానికి అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా..?” అని పొంగులేటి ప్రశ్నించారు.
‘‘పదేళ్లలో హైదరాబాద్లో కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టని మీకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక నగరమే దేశం అంటే అసూయ కలగక తప్పదు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫాంహౌస్ లు కట్టారు. పగటి కలలు కంటున్న హరీశ్ రావు, ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. తిరుగులేదు అని పొంగులేటి అన్నారు.

