ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. గ్రామీణాభివృద్ధికి భారీ నిధులు.. కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ సంస్థల అభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులు సిఫార్సు చేసింది. 2030-31 వరకు ఐదేళ్ల కాలానికి మొత్తం 4,35,236 కోట్ల గ్రాంట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించింది.
వేల కోట్ల రూపాయల నిధులు…
దీని ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌కు 16,627 కోట్ల రూపాయలు, తెలంగాణకు 9,968 కోట్ల రూపాయల నిధులను కేటాయించనుంది. ఈ నిధులను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులలో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కోసం వినియోగించనున్నారు. దీంతో గ్రామీణ శాఖకు భారీగా నిధులు కేటాయించడం విశేషం.

