ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపిక.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు ముందే ఈ మార్పు జరుగుతుంటుంది. చాలా సందర్భాలలో షూటింగ్ కూడా చేశాక ఆర్టిస్టులను మార్చేస్తుంటారు. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’లో ఈ రెండో తరహా మార్పే జరిగింది. ఈ చిత్ర కథానాయికగా శ్రీలీలను అధికారికంగా ప్రకటించడం.. ఆమె చిత్రీకరణకు కూడా హాజరు కావడం లేదు.
కానీ అనూహ్యంగా తన స్థానంలోకి భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. దీనికి కారణాలేంటన్నది వెల్లడి కాలేదు. ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ముందు ఇందులో కథానాయిక పాత్ర భాగ్యశ్రీ దగ్గరికే వెళ్లిందట. కానీ ఏవో కారణాలతో ఆమె ఈ సినిమా ఒప్పుకోలేకపోయిందట. తర్వాత అనుకోకుండా మళ్లీ ఆ పాత్రకు తనే ఎంపికయ్యానని ఆమె మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ.
మొదట దర్శకుడు మురళీ కిషోర్ ‘లెనిన్’ కథ, అందులో భారతి పాత్ర గురించి చెప్పినపుడు తాను ఎంతో ఎగ్జైట్ అయినట్లు భాగ్యశ్రీ చెప్పింది. భారతి పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపించిందని.. ప్రేమకథ చాలా సహజంగా అనిపించిందని. ఎపిక్ లవ్ స్టోరీస్‌లో ఉన్న లక్షణాలు ఇందులో ఉన్నాయని ఆమె చెప్పింది. ఐతే ఈ పాత్ర విషయంలో తాను ఎంతో ఎగ్జైట్ అయినా.. డేట్లు, ఇతర కారణాలతో ఈ సినిమా వదులుకోవాల్సి వచ్చిందని.. కానీ తర్వాత మళ్లీ అనుకోకుండా ఈ సినిమా తన చేతికి వచ్చిందని ఆమె చెప్పింది.
మొత్తానికి ఒకసారి భాగ్యశ్రీని కాదనుకుని, శ్రీలీలను ఎంపిక చేశాక కూడా ఆమెను తప్పించి తిరిగి భాగ్యశ్రీనే ఈ పాత్రకు సెలక్ట్ చేశారంటే బలమైన కారణమే ఉండాలి. ఈ మార్పు వల్ల ‘లెనిన్’ టీంకు డబ్బులతో పాటు సమయం కూడా వృథా అయింది. అయినా హీరోయిన్ని మార్చారంటే శ్రీలీల ఈ పాత్రకు సూట్ కాదని, దానికి భాగ్యశ్రీనే కరెక్ట్ అని టీం ఎంత బలంగా ఫిక్సయిందో అర్థం చేసుకోవచ్చు.

