చిరంజీవి: 2023వ సంవత్సరం మెగా ఫ్యాన్స్ కి ఆరంభంలో సంక్రాంతి సీజన్ ఏ రేంజ్ కిక్ ఇచ్చిందో, అదే ఏడాది సెకండ్ హాఫ్ మెగా అభిమానులకు అదే రేంజ్ నిరాశను మిగిల్చింది. ఆ ఏడాది ఆగస్టులో 11 మెగా ఫ్యాన్స్ కి ఒక పీడకల లాంటిది. ఎందుకంటే ఆరోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం విడుదలైంది. తమిళంలో అప్పుడెప్పుడో సూపర్ హిట్ నిల్చిన ‘వేదలమ్’ చిత్రంగా ఈ సుందరి మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలైన రోజునే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్’ చిత్రం విడుదలైంది. ఫలితం ఏంటో అందరికీ తెలుస్తుంది. భోళా శంకర్ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడగా, ‘జైలర్’ చిత్రం సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి వదిలేసింది.
ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, తెలుగు వెర్షన్ నుండి 90 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరోపక్క ‘భోళా శంకర్’ చిత్రం మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. ప్రపంచంలో కనీసం పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. ఇంకా చెప్పాలంటే మన చిన్నతనం లో విడుదలైన ‘మృగరాజు’ కొన్ని సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు సెంటర్స్ లో వచ్చాయి. 2026 కూడా అదే సీన్ రిపీట్ అవ్వనుందా? అని అంటున్నారు నెటిజెన్స్. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి లాంగ్ అవైటెడ్ మూవీ ‘విశ్వంభర’ చిరాన్ని అక్టోబర్ 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదలయ్యే ముందు రోజు , అనగా అక్టోబర్ 15 న రజినీకాంత్ ‘జైలర్ 2’ చిత్రం విడుదలైంది.
ఈ సినిమా పై ఆడియన్స్ లో ఎలాంటి హైప్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ చిత్రం ఒక్క కంటెంట్ కూడా బయటకు రాలేదు, అయినా ఈ రేంజ్ క్రేజ్ ఉందంటే, ఇక టీజర్ , పాటలు విడుదల తర్వాత ఏ రేంజ్ హైప్ క్రియేట్ అవుతుందో మీరే ఊహించుకోండి. మరోపక్క విశ్వంభర మెగా ఫ్యాన్స్ కూడా పూర్తిగా మర్చిపోయారు. విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. ఇలాంటి మూవీ ని జైలర్ 2 వంటి భారీ హైప్ ఉన్న మూవీ కి పోటీగా విడుదల చేస్తే 2023 ఫీట్ రిపీట్ అవుతుందని స్వయంగా మెగా ఫ్యాన్స్ అంటున్నారు, మరి ఏమి జరగబోతుందో చూడాలి.

