అమెరికా, ఇరాన్ మధ్య యుద్దంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.. అయితే యుద్దానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ అందుబాటులో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుదల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కీలక కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటన చేసింది.
దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న ధరలు అమెరికా, ఇరాన్ యుద్దానికి ముందు అంటే రెండు నెలల క్రితం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించాం.. ఇప్పుడు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో పెట్రోల్ ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. గతంలో నిర్ణయించిన రేట్లతో ముడి చమురు కొనుగోలు చేశాం.. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెట్రోల్ ధర తగ్గింపు సమీక్షిస్తామని అన్నారు.
►ఇంకా చదవండి | ముంబైని ముంచెత్తుతున్న వానలు..చెరువులను తలపిస్తున్న రోడ్లు.. కొట్టుకుపోతున్న వాహనాలు..దడ పుట్టిస్తున్న దృశ్యాల వీడియోలు
పశ్చిమాసియాలో ఘర్షణ సమయంలో కొనుగోలు చేసిన ముడి చమురును ఆయిల్ కంపెనీలు ఇప్పటికీ శుద్ది చేసి విక్రయిస్తున్నాయి. అందువల్ల ముడి చమురు ధరల తగ్గుదల ఇంకా రిటైల్ ఇంధన ధరల తగ్గుదల రాలేదని పెట్రోలియం మంత్రి చెప్పారు.
జూన్ 30 వరకు పెట్రోల్, డీజిల్, ఎల్ పీజీ ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు విక్రయించడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.74వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయని మంత్రి అన్నారు.
యుద్దం ప్రారంభమైన తర్వాత రిటైల్ ఇంధన ధరలు లీటరకు రూ.7.50లు పెరిగాయి. ఈ ప్రభావం తగ్గించేందుకు ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించింది.. ఆ తర్వాత రిటైల్ ధరలు పెంచేందుకు అనుమతించారు.

