మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి విక్రయిస్తున్న షాపుపై హెచ్ ఫాస్ట్ అధికారులు దాడి చేశారు. షాపు నుంచి 50కిలోల ఎద్దు మాంసం స్వాధీనం చేసుకున్నారు. పోసుల కథనం ప్రకారం…మల్లేపల్లి, హబీబ్నగర్లోని ఉస్మాన్ ఖురేషీ ఉస్మాన్ మీట్షాపును ఉన్నాడు. ఉస్మాన్ మేకమాంసం విక్రయిస్తున్నట్లు స్థానికులకు తెలుసు, కానీ మేక మాంసంలో ఎద్దు మాంసం మిక్స్ చేసి హోటళ్లకు సరఫరా చేయడానికి పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే హెచ్ ఫాస్ట్ అధికారులు షాపుపై
బుధవారం రాత్రి దాడి చేశారు. దాడి సమయంలో మేక మాంసంలో మిశ్రమం సిద్ధంగా ఉంచిన ఎద్దుమాంసం లభించింది. మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు ఆరు నెలల నుంచి మేక మాంసంలో ఎద్దు మాంసం కలిసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. నిందితుడు ఏ హోటళ్లకు మటన్ సరఫరా చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

