నేడు భువనగిరిలో రైతు గోస-బీజేపీ భరోసా యాత్ర జరగనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు సందర్శించనున్నారు. రైతుల సమస్యలు అడిగి బీజేపీ నేతలు తెలుసుకోనున్నారు. రైతు గోస – బీజేపీ భరోసా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
ధాన్యం కొనుగోలుపై…
తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఈ శ్రీకారం చుట్టారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడంతో పాటు ప్రభుత్వం పై వత్తిడి తెచ్చేందుకు ఈ యాత్ర జరిగింది. రేపు భూపాలపల్లి, కాటారం, మంథని,పెద్దపల్లిలో అందించనున్నారు.

