తెలంగాణ:సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో చెరువులో చేపలు పట్టేందుకు నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా బయటకు పంపుతున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.గ్రామ ప్రజలు, రైతులు ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల వివరాల ప్రకారం, చెరువులో చేపల వేట సులభం కావాలనే ఉద్దేశంతో నీటిని తూము ద్వారా బయటకు పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.దీంతో చెరువులో నీరు వృథాగా పోవడంతో పాటు, దిగువ ప్రాంతాలకు నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా ఈ నీరు సాగునీటి అవసరాలకు కీలకమైందని రైతులు భావిస్తున్నారు.ఈ చర్యలు చట్టపరంగా కూడా తప్పవని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా నీటి వదలడం నీటి వనరుల సంరక్షణ చట్టాలు, పర్యావరణ పరిరక్షణ నిబంధనలు ఉల్లంఘనగా పరిగణించబడతాయి నీటిని వృథా చేస్తే సంబంధిత నిర్వాహకులపై జరిమానాలు విధించడం,అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గ్రామస్థులు ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.చెరువు నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని,వ్యక్తిగత లాభాల కోసం సహజ వనరులను నాశనం చేయడం గురించి స్పష్టం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ విషయం సంబంధిత శాఖ అధికారులకు,ఇరిగేషన్ ఫిర్యాదులు చేరినట్లు సమాచారం.అధికారులు పరిశీలించి,నిజానిజాలు నిర్ధారించిన తరువాత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


