Sujeeth And Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా తెరకెక్కింది. గత సంవత్సరం రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదించుకుంది. అలాంటి దర్శకుడు ఇప్పుడు నానితో ‘బ్లడీ రొమియో’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ‘ఓజీ 2’ సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ గ్యాప్ లోనే సుజీత్ పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అఖీరా నందన్ కోసం అదిరిపోయే కథను కూడా రెడీ చేశారట. ఇక ఈ కథలో హీరో స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడు. అలాగే అతను ఎదురుకునే కొన్ని ఇబ్బందుల వల్ల తను ఎలా ఫైట్ చేశాడు. సొసైటీకి వ్యతిరేకంగా జరుగుతున్న కొన్ని ఇల్లీగల్ పనులను ఎలా పట్టుకున్నాడు అనే దాని మీదనే ఆ కథించాడు.
అకిరా నందన్ మొదటి సినిమా కోసం ఎలాంటి కథ కావాలని చూస్తున్నారో అచ్చం అలాంటి కథ నే సుజిత్ చెప్పాడట. ఆ కథకి పవన్ కళ్యాణ్ కూడా ఇంప్రెస్ అయినట్టుగా తెలుస్తుంది. అకీరా కి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుందని పవన్ కళ్యాణ్ కూడా అనుకుంటున్నాడట.
ప్రస్తుతం అకీరా యాక్టింగ్ కు సంబంధించిన శిక్షణను తీసుకుంటున్నాడు. కాబట్టి తొందరలోనే అతను ఇండస్ట్రీకి పరిచయం అయ్యే అవకాశాలైతే. ఇక తనని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను కూడా సుజీత్ కి అప్పజెప్తారా? లేదంటే ఇంకెవరైనా దర్శకుడి చేతిలో పెట్టే అవకాశాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.
మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో దాదాపు ఉన్నప్పటికి తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసి అతన్ని కూడా స్టార్ హీరోగా మార్చాలని ప్రయత్నించాడు. అతను తన అభిమానులకు సైతం పవన్ కళ్యాణ్ లేని లోటు తీర్చాలంటే అఖీరానందనే కరెక్ట్ అని పవన్ కళ్యాణ్ అనుకున్నట్లుగానే కోరుకుంటున్నాడట…

