. లండన్ తరహాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాజెక్టుగా అభివృద్ధి
. జులై 1 నుంచి వీబీజీ రామ్‌జీ అమలు
. అగ్రిగోల్డ్ కేసులు పరిష్కరించే ప్రత్యేక కోర్టుకు 21 పోస్టులు
. కొత్తగా ఏపీ విమానయాన పాలసీ`2026
. శ్రీ సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం
. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఓ బృహత్తర ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. నాలుగేండ్లలో ‘లండన్ ఐ’ తరహాలో కృష్ణానది తీరాన ‘అమరావతి ఐ’ ప్రాజెక్టు నిర్మాణ సీఆర్డీఏ ప్రతిపాదించగా మంత్రిమండలి ఆమోదం. 6 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజధాని, నదీ తీర అందాలను తిలకించవచ్చు. పర్యాటకులను ఆకర్షించడానికి ఇది ఒక ప్రత్యేకమైన ల్యాండ్ మార్క్‌గా నిలుస్తుందని మంత్రివర్గం భావించింది. దీనికి తక్షణమే టెండర్లు ఆహ్వానించడానికి కూడా అనుమతి ఇస్తూ మండలి ఆమోదం ఉంది. చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం సుమారు 35 గంటలపాటు ముఖ్యమంత్రి చర్చించారు. మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.
అమరావతి కోసం సిఆర్డీఏ కేటాయించిన 49.66 ఎకరాల భూమిపై స్టాంప్ డ్యూటీ, జమీన్మెంట్ ఫీజు, యాజకర్ చార్జీలు మినహాయింపు, రాజధాని ప్రాంతంలో జరిగే వివిధ అభివృద్ధిపనులకు సీఆర్డీఏ ఆమోదించిన అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిపాదన ప్రకారం రాష్ట్రంలో అవయవ దానం మార్పిడి కార్యకలాపాలను పకడ్బందీగా నియంత్రించడానికి ప్రభుత్వం అందించిన ‘ద ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్, 2011 ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయడానికి ఆమోదం.
అసెంబ్లీ సమావేశాలు 12.03.2026 నుండి వాయిదా పడిన కారణంగా, దీనిని ‘ద ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ (అమెండ్మెంట్) ఆర్డినెన్స్, 2026’ పేరుతో ఒక ఆర్డినెన్స్ రూపంలో జారీ చేస్తారు.
అ బీచ్ షాక్స్ కోసం ముసాయిదా ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు ఆమోదం. మొదటి దశలో చీరాల, విశాఖపట్నంలో ఒక్కొక్క చోట రెండేసి షాక్‌లు పైలట్ ప్రాతిపదికన ప్రారంభించిన తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయం.
అ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లెఫ్ట్ మె కెనాల్ ప్యాకేజ్ నం.5, 5ఏకు సవరించిన అంచనాల ప్రకారం రూ.796.66 కోట్ల కేటాయింపు.
అ బాపట్ల జిల్లాలో కుందేరు డ్రైన్ తవ్వకం పనులకు రూ.517.50 లక్షలు.
న్యాయ శాఖ ప్రతిపాదన మేరకు ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-1999 కింద నమోదైన కేసులతో పాటు ప్రత్యేకించి అగ్రిగోల్డ్ల కేసు విచారణ, పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకు 21 నూతన పోస్టులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ విమానయాన పాలసీ 2026 (2026-31)కు మంత్రి మండలి ఆమోదం. రాష్ట్ర విమానయాన రంగాన్ని సమంగా మార్చే లక్ష్యంతో ఈ పాలసీని రూపొందించారు. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో విమానయాన రంగానికి భారీ ఊతం లభించనుంది. 2035 నాటికి ప్రయాణికులు 6.2 మిలియన్ల నుంచి 30.38 మిలియన్లకు, ఎయిర్ కార్గోను 6,240 మెట్రిక్ టన్నుల నుంచి 4.27 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మరో 9 కొత్త విమానాశ్రయాలు, 10 వాటర్‌డ్రోమ్స్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా 150 కి.మీ వసతి గృహాలను ఏర్పాటు చేస్తున్నారు.రాష్ట్రాన్ని దేశంలోనే ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విశిష్టతను ఏర్పాటు చేసింది.
జూలై 1 ఆంధ్రప్రదేశ్‌లో ‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామిన్) అమలు చేయడానికి అవసరమైన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
అ విశాఖపట్నం రూరల్ మండలం మధురవాడ గ్రామంలో సర్వేనెంబరు 426/3లో 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు స్టార్ హోటల్, రిసార్ట్లు లేదా ఇతర పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి బదిలీ చేయడానికి ఆమోదం.
అ చిత్తూరు జిల్లా లింగాపురం దిన్నె మండలం గుడుపల్లె గ్రామంలో 12.75 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసీ లిమిటెడ్‌కు ఇండస్ట్ రియల్ పార్క్ స్థాపన కోసం మార్కెట్ ఎకరాకు రూ.12,00,000/- చొప్పున చెల్లింపులు చేసేందుకు ఆమోదం.
నెల్లూరు జిల్లా సీతరామపురం (వీ), పెదనాగంపల్లి 14.10 ఎకరాల ప్రభుత్వ భూమిని రెమ్యునరేషన్ శాఖకు బదిలీ చేయడానికి ఆమోదం.
అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామానికి చెందిన కొత్తూరులో 2 ఎకరాలు, కాకినాడలో 1.45 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగు దేశం పార్టీ భవన నిర్మాణానికి 66 సంవత్సరాల లీజు పద్ధతిలో కేటాయించడానికి ఆమోదం.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 0.50 ఎకరాల ప్రభుత్వ భూమిని యÖ5 బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ భవనం నిర్మాణం కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో వార్షిక అద్దె రూ.1,25,23,500/- చొప్పున ప్రతి 5 సంవత్సరాల బ్లాక్‌కు 10 శాతం పెంపుతో మంజూరు చేయబడుతుంది.
కృష్ణా జిల్లా చల్లపల్లిలో 11.80 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధికి కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం.
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో తిరుపతి జిల్లా శ్రీసిటీలో ‘శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యÖనివర్సిటీ’ పేరుతో నూతన ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని (గ్రీన్‌ఫీల్డ్ కేటగిరీ కింద) స్థాపించడానికి వీలుగా ‘ఏపీ ప్రైవేట్ యాజమాన్యం యాక్ట్-2016’ షెడ్యూల్ ఆమోదం పొందింది. శ్రీసిటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.250 కోట్ల పెట్టుబడితో 60 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ విశ్వవిద్యాలయం స్టార్టప్‌లు, ఇంక్యుబేటర్లు మరియు యాక్సిలరేటర్లకు కేంద్రంగా పనిచేస్తున్న విద్యార్థులకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.
అ ఈ నెల జూన్ 7 నుండి 21 వరకు పక్షం రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ప్రామాణిక నిర్వహణ విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలుపుతూ రూ.10 కోట్లు ప్రదానం చేసింది. ఈ వేడుకల్లో భాగంగా అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది పౌరులను భాగస్వాములను చేయనున్నారు. ఇదే విధంగా, రాష్ట్రంలో యోగా, ప్రకృతి వైద్యం ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచి ‘ఆరోగ్యక రామన్ మరియు సంతోషకరమైన ఆంధ్రప్రదేశ’ను సాధించే లక్ష్యంతో యోగా అండ్ నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేసింది మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి.

