విప్రో సక్సెస్ స్టోరీ 2026: ఐటీ కంపెనీలు వాతావరణాన్ని ప్రతిబింబిస్తాయి. వర్క్ కల్చర్, ఉద్యోగుల వేషధారణ, వారి మాటతీరు ప్రతీది కూడా మనల్ని మరో దేశంలోకి తీసుకెళ్తుంది. అందుకే ఐటీ కంపెనీల ఉద్యోగులకు తగ్గట్టుగా పని వాతావరణాన్ని కల్పిస్తోంది. ఆహ్లాదానికి పార్కులు, తినడానికి క్యాంటిన్లు, సేద తీరడానికి ఓపెన్ ఏరియాలు.. అలా అనేకం ఉంటాయి.
ప్రశాంతతకు, కోట్ల రూపాయల ప్రాజెక్టులకు కేంద్రాలైన ఐటీ కంపెనీలు దారుణమైన కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిపోతున్నాయి.. ఇటీవల టిసిఎస్ కంపెనీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఉద్యోగుల భద్రత.. ఇతర ఆందోళనకు కారణమైంది. ఇది రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు.
టిసిఎస్ కంపెనీలో జరిగిన ఘటనను మర్చిపోకముందే విప్రోలు ఓ మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. తాను పని చేస్తున్న మహిళ వివిధ వేధింపులు ఎదురయ్యాయని.. ఆ వాపోయింది. పూణెలో ఆ మహిళ పనిచేస్తున్న సమయంలో కొంతమంది మానసిక ఒత్తిడికి గురి చేశారు. మతం మారే విషయంలో ఇబ్బందులు పెట్టారు. దీంతో ఆమె హింజ వాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినా ఉపయోగం లేకుండా పోయింది. సంస్థలో వేధింపులు.. పోలీసులు ఆమె మానవ హక్కుల కమిషన్ వద్దకు వెళ్లారు. ఈ ఘటనలో సంచలనం సృష్టించడంతో.. విప్రో కంపెనీ స్పందించింది.
ఆ మహిళ చెప్పినట్టుగా కొందరు సీనియర్ మేనేజర్లు.. టీం లీడర్లు బలవంతం చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని విప్రో కంపెనీ స్పష్టం చేసింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో.. గౌరవం విషయంలో.. స్వేచ్ఛ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఉద్యోగులకు సురక్షితంగా పని పరిస్థితులు కల్పిస్తామని.. వారితో నిబద్ధతను కలిగి ఉంటామని విప్రో కంపెనీ తెలిపింది. అంతేకాదు ఈ వ్యవహారంలో పోలీసులు అడిగిన పత్రాలు మొత్తం ఇచ్చామని.. ఇలాంటి వ్యవహారాల్లో ఉపేక్షకు తావు లేకుండా వ్యవహరిస్తున్నామని విప్రో కంపెనీ ప్రకటించింది.

