మేషరాశి ఫలితాలు :-
మేష రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రావలసిన బెనిఫిట్స్ రావడం, ముఖ్యంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి అవ్వటం జరుగుతుంది. అదేవిధంగా స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు గృహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం పూర్తయ్యే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా నూతన గృహానికి సంబంధించి కొంత మొత్తంలో అడ్వాన్సు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ఇప్పటివరకు మొదలుపెట్టిన పనులు మధ్యలో ఆగిపోయినవి ఏవైతే ఉన్నాయో అవి ఇక నుండి ప్రారంభం అవుతాయి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఆలస్యమైనా చివరకు విదేశాలకు వెళ్లాలనుకునే కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా విదేశాలలో ఉండి చదువుకునే వారికి విద్యా పరంగా వృత్తిపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. డిహైడ్రేషన్ ఆసిడిటీ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా భూ సంబంధిత విషయ వ్యవహారాలు రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి స్థిరాచరాస్తులు అకౌంటింగ్ సెక్షన్ ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి మంచి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. చిరుస్తాయి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పప్పు దినుసు వ్యాపారస్తులకు కూరగాయ వ్యాపారస్తులకు లాభసటిగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఇంకాస్త కష్టపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల సహాయ సహకారాలతోటి మరింత ముందుకు వెళ్లే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే ఎక్కువగా ఆలోచనలు చేయటం అనేది మంచిది కాదు . ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న అధికారులు పై అధికారుల పట్ల జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం శని స్తోత్రం పటించాలి. కాలభైరవ రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ఆరావలి కుంకుమ కుబేర కుంకుమ తోటి అమ్మవారిని పూజించడం ఎరుపు వత్తుల తోటి దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కాని వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృషభ రాశి ఫలితాలు :-
వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు సమసి పోతాయి. ధనాధాయం బాగుంటుంది. పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి. మీరు సాధించిన ఘన విజయాలను ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతాల కోసం తాపత్రయపడతారు. ఏది ఏమైనా సరే మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం చాలా వరకు ఉంటుంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రుణాలు సాధ్యమైనంత వరకు తీర్చగలుగుతారు. కొత్త రుణాలకు స్వస్తి పలుకుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. సంతానం విషయంలో వారి ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారి చదువు విషయంలో కూడా కొంత ఇబ్బంది ఉండే అవకాశం గోచారిస్తుంది. అదేవిధంగా భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వాహనం కానీ స్థిరాస్తీ కానీ కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. విదేశాలలో ఉన్న వారికి నూతన విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ప్రయత్నాలు ప్రారంభించండి కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అంతా అనుకూలంగా లేదు. చదువు మీద శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక విషయంలో శ్రద్ధ అవగాహన పెంచుకోవాలి. కష్టానికి తగిన ప్రతిఫలం చేతిదాకా వచ్చి చేజారిపోతుంది. అయితే పైకి రావాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం శివతాండవ స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమయానికి ఆహారం నిద్ర ఉండాలి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరావళి కుంకుమతో మొగలిపువ్వు కుంకుమ తోటి అమ్మవారిని పూజించడం అదేవిధంగా లక్ష్మీనారాయణ వత్తులు ఎరుపువత్తులు కలిపి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మిథున రాశి ఫలితాలు :-
మిథున రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రావటం అలాగే ప్రమోషన్స్ వస్తాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగం లభించడం జరుగుతుంది. మీరు కోరుకునే ఉద్యోగం లభించే దిశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసివచ్చే కాలం అని చెప్పవచ్చు. అదేవిధంగా సినీ కళా రంగాల వారికి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి చార్టెడ్ అకౌంటెంట్స్ మెకానికల్ చిరు వ్యాపారస్తులకు డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు మొదలగు వ్యాపారస్తులకు చాలావరకు అనుకూలంగా ఉంది. కూరగాయ వ్యాపారస్తులకు సూపర్ మార్కెట్ వాళ్లకు కూడా అనుకూలంగా ఉంది. ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్లాలనే ఆలోచన చేస్తారు. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం కానీ శివతాండవ స్తోత్రం కాని పటించి ముందుకు వెళ్ళండి. విష్ణు ఆలయ దర్శనాలు చేసుకోండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కలిసివచ్చే కాలం అని చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచన తోటి ముందుకు వెళ్లాలి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పటించండి. చదువులో రాణించగలుగుతారు. మీరు ఎంచుకున్న సబ్జెక్టులో ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఒక ఆకస్మిక సంఘటన చోటు చేసుకుంటుంది. మంచి శుభవార్తలు వింటారు. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న మీ కోరిక ఈ వారం నెరవేరుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా స్థిరపడటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగ పరుచుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ కళా రంగాల వారికి కాస్మోటిక్ వైద్య వృత్తిలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్ కు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు మొగలిపువ్వు కుంకుమతోటి కుబేర కుంకుమతోటి అమ్మవారిని ఆరాధించడం చెప్పదగిన సూచన. లక్ష్మీ తామర వత్తులతో మంగళవారం నాడు శుక్రవారం నాడు దీపారాధన చేయండి. అదేవిధంగా ఎరుపు వత్తులతో ప్రతిరోజు స్వామివారికి దీపారాధన చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే సంఖ్య 7 ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కర్కాటక రాశి ఫలితాలు:-
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. మీ జీవితంలో కొన్ని శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎంతో కాలంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. అయితే సహోదరి సహోదరుల మధ్య ఆస్తి తగాదాల విషయం పెద్దది అయ్యే అవకాశం కనిపిస్తుంది. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే సామరస్యంగా ఉండి కోపాన్ని అదుపులో ఉంచుకొని సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. మనసులో పరిపరి విధాల ఆలోచనలు తలెత్తుతాయి. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలి. ఈ వారం మీకు సాధ్యమైనంత వరకు అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వృత్తి ఉద్యోగాలపరంగా, వ్యాపార పరంగా చాలావరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో స్థాన చలనం ఏర్పడుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలావరకు అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా మెకానికల్ టెక్నికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపారపరంగా మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. సొంత వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. ఉద్యోగంలో స్థాన మార్పు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదో విధంగా పై అధికారులతో మీకు ఇబ్బంది ఏర్పడుతుంది. దైవానుగ్రహం వలన కొంతమంచి జరుగుతుంది. ధైర్యంగా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఇతరుల నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. అదేవిధంగా శుభకార్యా విషయాలు వివాహాది శుభ విషయాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం అదేవిధంగా సౌర కంకణం చేతికి ధరించటం మగవారు అష్టముఖి రుద్రాక్షను మెడలో ధరించటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసవచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
సింహరాశి ఫలితాలు :- సింహ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి . మీరు ఈ వారం ఏ పని ప్రారంభించిన శుభ ఫలితాలను ఇస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయితే అవి శుభసూచకం అని చెప్పవచ్చు. ఖర్చులు ఎలా ఉన్నప్పటికీ రాబడి కూడా అంతకుమించి ఉంటుంది. స్థిరాస్తులు గాని ఆభరణాలు గాని కొనుగోలు చేస్తారు. పిల్లలను స్థిరపరచాలని ఆలోచన చేస్తారు. మనం పడ్డ కష్టం పిల్లలు పడకూడదు అనే ఆలోచన చేస్తారు. ఏదైనా సరే ఖాళీగా ఉండకుండా నాకంటూ ఏదైనా ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు మేలు చేస్తాయి. అదేవిధంగా సొంత వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు కలిసి వస్తాయి. చార్టెడ్ అకౌంటెంట్స్ రియల్ ఎస్టేట్ వారికి ఫైనాన్స్ సెక్టార్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగా ప్రవేశం చేద్దామనుకునే వారికి కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ యానం చేయాలనే కల నెరవేరుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సంతాన విద్యా విషయాలు సంతాన వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారు మంచి శుభవార్త వింటారు. అదేవిధంగా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో మన పర్సనల్ విషయాలు పంచుకోకూడదు. దీనివల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఆరావాళి కుంకుమ తోటి అమ్మవారిని పూజించటం అలాగే దుర్గా స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన. దీని ద్వారా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా అష్టమూలికా తైలం తోటి ఓం నమశ్శివాయ వత్తులతోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కన్యా రాశి ఫలితాలు :-
కన్య రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగంలో కొన్ని చిన్న చిన్న మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ పరంగా స్థానచలనం కూడా ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే కొన్ని కొన్ని సందర్భాలలో ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఓపిక చాలా వరకు అవసరం. తొందరపాటు నిర్ణయాల వల్ల మనమే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఇది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ వర్తిస్తుంది. అయితే వృత్తి ఉద్యోగంలో మటుకు నిదానంగా ఉండి ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా స్థిర చరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. క్రెడిట్ కార్డులకు పర్సనల్ లోన్లకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఒక స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకోని సంఘటనలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అనుకొని సంఘటనలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వారికి మంచి పదవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారాల కంటే ఈ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయే తప్ప మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. అదే విధంగా విదేశాలకు వెళ్లి మనకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలి అనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకునే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారం మీద దృష్టి సారిస్తారు. మీ తెలివితేటలకు మీ సమయస్ఫూర్తి కి పదిమంది మెచ్చుకోలుగా ఉంటుంది. మీరు మాట్లాడే విధానం అందరికీ ఆమోద దాయకంగా ఉంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్న సరే అది మీకు లాభ సాటిగానే ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పటించడం వలన విద్యార్థిని విద్యార్థులు చదువులో రాణించగలుగుతారు. అదేవిధంగా దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గడిచిన వారాల కంటే ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. మీ పేరు మీద చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి ట్రావెల్ ఏజెన్సీ వారికి కాలం అనుకూలంగా ఉంది. అలాగే చిరు వ్యాపారస్తులకు సినీ కళా రంగాల వారికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పదిమంది సలహాలు తీసుకోండి దాని ద్వారా మీరు లాభపడతారు. ఈ రాశి వారు ప్రతి రోజు అమ్మవారికి కుబేర కుంకుమ మొగిలి పువ్వు కుంకుమ తోటి ఆరాధన చేయండి దీని ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7 కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
తులా రాశి ఫలితాలు :-
తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగులపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారం చక్కగా ఉంటుంది. మీరు సొంతంగా చేసే వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరుతుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. భూమి కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం వీరికి తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. రావలసిన బెనిఫిట్స్ వస్తాయి. ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి. దుర ప్రాంత ప్రయాణాలు చక్కగా కలిసి వస్తాయి. సొంతంగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు లాభసాటిగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కొంతవరకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. చదువు మీద శ్రద్ధ వహించండి తద్వారా భవిష్యత్తు బాగుంటుంది. విలాసాలకు దూరంగా ఉండండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. స్నేహాలకి కూడా దూరంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగులపరంగా చాలావరకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి అవకాశం కలిసి వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి రాజకీయ రంగంలోకి వెళ్దాం అనుకునే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. మీ ప్రయత్నాలు మీరు కొనసాగించండి అదేవిధంగా భూ సంబంధిత విషయ వ్యవహారాలు సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. భాగస్వామి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. రావలసిన డబ్బు లేటుగా వచ్చిన తక్కువగా వచ్చిన పొదుపు చేయటం అలవాటు చేసుకోండి. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం మొగలిపువ్వు కుంకుమ తోటి కుబేర కుంకుమ తోటి అమ్మవారికి అష్టోత్తరం చేయించండి. అదేవిధంగా మగవారు ఏకముఖి రుద్రాక్షను ఆడవారు ఇంద్రాణి రూపం మెడలో ధరించటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృశ్చిక రాశి ఫలితాలు :-
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా మంచి సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభసాటిగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఏవైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోయి ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. ఒక స్థిరాస్తిని అమ్మేసి నూతన వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి మీ నిర్ణయం ఆమోదకంగా ఉంటుంది. పదిమంది మెచ్చుకోలుగా కూడా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించే వారికి మొదట్లో లాభాలు తక్కువగా ఉంటాయి. ఇది తాత్కాలికమే కాబట్టి వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు మీరు చేయండి. భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సంతానానికి ఒక మంచి సంబంధం కుదరటం జరుగుతుంది. సంతానానికి సంబంధించి వారి విద్యా మీద వారి ఉద్యోగం మీద శ్రద్ధ వహించండి. ప్రభుత్వ రంగంలోకి వెళ్లడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడతాయి. భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజూ దక్షిణామూర్తి స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మెకానికల్ టెక్నికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య వృత్తిలో ఉన్న వారికి బాగుంటుంది. ఏదైనా సరే కష్టం మనం పడి ఫలితం భగవంతుడికే వదిలేయాలి. పేరు ప్రఖ్యాతల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి అలాగే వారి సంతానానికి ఎలాంటి ఆటంకాలు లేవు. ఈ రాశిలో జన్మించినవారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం అదేవిధంగా అమ్మవారికి కుబేర కుంకుమ తోటి కుంకుమార్చన చేయించండి అదే కుంకుమను నుదుటన ధరించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి ఫలితం ఉంటుంది. సంతానం యొక్క విద్య కోసం ఉద్యోగం కోసం పెళ్లి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి ఫలితాలు :-
ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. దూరప్రాంత ప్రయాణాలు అనుకోని సంఘటనలు వీరికి మేలు చేస్తాయి. ఉద్యోగ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాశి వారు ధైర్యంగా చేస్తే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి టెక్నికల్ రంగంలో ఉన్నవారికి చిరుస్తాయి వ్యాపారస్తులకు మెడికల్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. కూరగాయ వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేయని తప్పుకు నింద పడాల్సి వస్తుంది ఈ రాశి వారికి. అయితే దైవానుగ్రహం వలన అవన్నీ సమసి పోతాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం గాని దుర్గా స్తోత్రం గాని పఠించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ఏదైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి అంతా మంచే జరుగుతుంది. భవిష్యత్తు బాగుంటుంది. దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు కలుగుతాయి . అదేవిధంగా స్థిరాచరాస్తులకు సంబంధించి వీరికి రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి కోర్టు సంబంధిత విషయ వ్యవహారాలు కూడా సానుకూల పడతాయి. అయితే ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వలన స్ట్రెస్ కు గురవుతారు. దీని ద్వారా ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారు చతురుముకి రుద్రాక్షను మెడలో ధరించాలి ఆడవారు కాలభైరవ రూపాన మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మకర రాశి ఫలితాలు:-
మకర రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఆరోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. జాగ్రత్త వహించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. క్రయవిక్రయాలు లాభిస్తాయి. సహోదరి సహోదరుల మధ్య ఉన్న విభేదాలు సమసి పోతాయి. వీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. అదేవిధంగా సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు ఒక సంబంధం కుదురుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు. సొంత ఆలోచనలతోటి ముందుకు వెళ్లాలి. పదిమందిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలనే ఆలోచన తోటి ఉంటారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. మనసు పరిపరి విధాలుగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లినట్లయితే లాభపడతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్యపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి టెక్నికల్ రంగంలో ఉన్న వారికి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి ఫార్మారంగం వారికి కాలం చాలా చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి లాభసాటిగా ఉంది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీ పేరు మీద చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభసాటిగా ఉంటాయి. కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు శని స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం పటించడం చెప్పదగిన సూచన. మెడలో కాలభైరవ రూపును ధరించండి నరదృష్టి తగ్గుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ప్రతినిత్యం ఎరుపు వత్తులతో దీపారాధన చేయాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి ఫలితాలు :- కుంభ రాశి వారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. అయితే దూరప్రాంత ప్రయాణాలలో ఆకస్మిక సంఘటనలు చోటుచేసుకునే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా సహోదరి సహోదరుల మధ్య మనస్పర్ధలు లేకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. సహోదరి సహోదరుల మధ్య స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అవి తొలగిపోతాయి. వివాహ విషయానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఒక సంబంధం కుదురుతుంది. విద్యార్థిని విద్యార్థులకు కాలం చాలా చక్కగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో బైక్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి. చెడు వ్యసనాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు చేతిదాకా వచ్చి చేజారిపోతాయి. స్టాంపింగ్ విషయంలో గ్రీన్ కార్డు విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు శని స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం పటించడం వలన మీరు తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి. మీ పని మీరు చేసుకోండి ఫలితం దైవానికి వదిలేయండి ఆ దైవానుగ్రహం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలు వ్యాపారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉండదు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ధన ఆదాయం బాగుంటుంది. ఎప్పుడో పెట్టిన స్థిరాస్తులపై పెట్టుబడి విలువ పెరుగుతుంది. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. దైవదర్శనాలు విందు వినోదాలు విహారయాత్రలు ఎక్కువగా చేసుకుంటారు. ఏలినాటి శని నడుస్తుంది ప్రతిరోజు శని స్తోత్రం పఠించండి. ఎరుపు వత్తులతో దీపారాధన చేయండి. శనివారం నాడు నవగ్రహ వత్తులతో దీపారాధన చేసి నవగ్రహ స్తోత్రం పటించండి తద్వారా మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి జాప్యం లేకుండా ముందుకు సాగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీన రాశి ఫలితాలు :-
మీన రాశి వారికి మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారపరంగా ఉద్యోగ పరంగా కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. మీరు ఎంత కష్టపడినప్పటికీ ధనాధాయం బాగున్నప్పటికీ ఖర్చులు అదేవిధంగా ఉంటాయి. ఎందుకు చేస్తున్నం ఎలా చేస్తున్న అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డులు గానీ పర్సనల్ లోన్లు గాని ఎక్కువగా వాడకండి అవసరమైతే తప్ప. అప్పులు తీసుకోవడం కానీ ధనాన్ని ఖర్చు పెట్టడం కాని చేయకండి. ఎవరైనా ఏదైనా ఆర్థికంగా సహాయం అడిగితే లేదని నిర్మోహమాటంగా చెప్పండి . ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం శని స్తోత్రం పఠించండి. అదేవిధంగా దూరప్రాంత ప్రయాణాలు ఆకస్మిక సంఘటనలు విదేశీ వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉన్నాయి. విదేశీయానం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . ఏదైనా సరే మీరు అనుకున్న పనిలో ఎంత ఇబ్బంది ఎదురైనా సరే చివరకు నెరవేరుతుంది. అయితే దానికోసం ఎక్కువగా మదనపడటం తాపత్రయపడటం ఆందోళన చెందటం చేయకండి. దానిద్వారా స్ట్రెస్ ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశి వారు సంతానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వారి అభివృద్ధి కోసం చేసే పెట్టుబడులు కానీ స్థిరాస్తులు కొనుగోలు కానీ ఫలిస్తాయి. వీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు విదేశాలలో ఉండి చదువుకునే వారికి కాలం చక్కగా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాలు కొంత నష్టపోయే అవకాశం ఉంది. మీ పేరు మీద చేసే వ్యాపారాలు మీకు లాభసాటిగా ఉంటాయి. వాటి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా లేదు. ఇంటా బయట చికాకులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పరంగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏం చేసినా సరే పెద్దగా కలిసి రాదు. దీని ద్వారా మనస్థాపనకు గురి అవుతారు. ఈ రాశి వారికి ఈ వారం గడిచిన వారాల కంటే కొంత మేలు జరుగుతుంది. అయితే ఈ వారం మటుకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయటం అదే విధంగా లక్ష్మీ తామరవత్తులు అరటి నారవత్తులు కలిపి దీపారాధన చేయాలి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

