కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ కం యాక్టర్ ఆర్జే బాలాజీ కాంబోలో వచ్చిన చిత్రం ‘కరుప్పు'(తెలుగులో ‘వీరభద్రుడు’). బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డుల దుమ్ము దులిపేసింది ఈ మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. సూర్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలచిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్‌ను షేక్ చేయడానికి రెడీ అయిపోయింది.
ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..
ఈ ‘కరుప్పు’ సినిమా ఓటీటీ రిలీజ్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. సాధారణంగా అన్ని భాషల వెర్షన్లను ఒకే లింక్‌లో ఇస్తుంటారు. కానీ తెలుగు ఆడియన్స్ కోసం అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలన్నీ ఒక లింక్‌లో అందుబాటులో ఉంటే.. తెలుగు వెర్షన్ ‘వీరుడు’ కోసం ప్రత్యేకంగా ఒక సపరేట్ స్టాండ్అలోన్ లింక్‌ను కేటాయించారు. థియేటర్లలో తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చారో, డిజిటల్‌లోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికే ఈ క్రేజీ డెసిషన్ తీసుకున్నారట. జూన్ 12 నుంచి ఓటీటీ లో ఈ బ్లాక్‌బస్టర్ మూవీ స్ట్రీమింగ్ సంస్థ.
కథేంటంటే..
న్యాయవ్యవస్థలోని అవినీతి అంతం చేసే ఒక పవర్ ఫుల్ లాయర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అయితే ఆ లాయర్ ఎవరో కాదు.. సాక్షాత్తు కలియుగ కాపలా దైవం ‘కరుప్పుసామి’ మానవరూపం. మంచికి (సూర్య), చెడుకి (ఆర్జే బాలాజీ) మధ్య జరిగే ఈ మోడ్రన్ మైథలాజికల్ వార్ ఆడియన్స్‌కు గూస్బంప్స్ తెప్పించింది. చాలా కాలం తర్వాత సూర్య, త్రిషల కాంబినేషన్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయగా.. సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను ఊపేసింది. ఆర్జే బాలాజీ విలనిజం సినిమాకే హైలైట్‌గా నిలిచింది.
వివాదాలు దాటి..
నిజానికి ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో మే 14న ఫస్ట్ డే ఫస్ట్ షో క్యాన్సిల్ అవ్వడంతో పెద్ద గందరగోళం ఏర్పడింది. పాత బాకీల వల్ల డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లను లాక్ చేయడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. దర్శకుడు ఆర్జే బాలాజీ ఎమోషనల్ అవుతూ క్షమాపణలు కూడా చెప్పారు. కట్ చేస్తే.. మరుసటి రోజు మే 15న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఊడ్చేసింది. ఈ సక్సెస్ ఆనందంలో సూర్య.. సినిమాటోగ్రాఫర్ జి.కె. విష్ణు, మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్, ఎడిటర్ సెల్వమణి మహీంద్రా BE6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ విజువల్ వండర్, థియేటర్లలో లాగే ఓటీటీలోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా తయారైంది. సో.. జూన్ 11 అర్ధరాత్రి నుంచే మీ హోమ్ థియేటర్లలో ‘వీరభద్రుడి’ జాతరను ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి.
గాడ్ మోడ్ ఆన్ 🔥 #కరుప్పుఆన్ ప్రైమ్జూన్ 12@Suriya_offl @RJ_బాలాజీ @సాయిఅభ్యాంకర్ @dop_gkvishnu @త్రిష్ట్రాషర్స్ @ప్రభు_శ్రీ #ఇంద్రన్ @నట్టి_నటరాజ్ #స్వాసిక @SshivadaOffcl #సుప్రీత్ రెడ్డి #అనఘమాయరవి #విక్రమ్ మోర్ @కళైవానానోఫ్ల్ #అరుణ్ వెంజరమూడు @PraveenRaja_Off @జీ తమిళ్… pic.twitter.com/VeKFZ4qViA
— ప్రధాన వీడియో IN (@PrimeVideoIN) జూన్ 8, 2026

