కాపు గర్జన: ఏపీలో కాపులు ఇప్పుడు తెరపైకి వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగా తూర్పుగోదావరిలో కాపుల మహా గర్జన జరిగింది. అయితే ఇది కూటమికి ఒక హెచ్చరిక లాంటిది. ప్రస్తుతం కాపులకు ఉన్న ఏకైక ఆప్షన్ కూడా కూటమి. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్మేస్థితిలో కాపులు లేరు. ఒకసారి కాపులు ఆ పార్టీని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం చేయకపోగా.. కాపులకు సంబంధించి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ పర్యవసానాలే ఆ పార్టీకి కాపులు దూరమయ్యారు. అప్పుడే వారంతా పవన్ కళ్యాణ్ వైపు టర్న్ అయ్యారు. అలా కూటమి వైపు అడుగులు వేశారు. అయితే ఇప్పుడు కూటమి పాలన రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో కాపులు తమ సమస్యలను పరిష్కరించాలని.. వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం బాట పడుతుండడం విశేషం.
* వైసీపీకి నో ఛాన్స్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కాపుల ఆలోచన మారే పరిస్థితి లేదు. ఎందుకంటే కాపుల రిజర్వేషన్లు అమలు చేయలేను అంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అంతకుముందు చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన ఐదు శాతం ఈ బి సి రిజర్వేషన్లను సైతం రద్దు చేశారు. ఆర్థికంగా వెసులుబాటు కల్పించే ఈ ఆర్థికపరమైన రిజర్వేషన్లను ఐదు శాతం ఇచ్చారు చంద్రబాబు. కానీ నేరుగా ముద్రగడ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని పద్మనాభం పెద్ద ఉద్యమమే చేశారు. అయితే అది రాజకీయ ప్రేరేపిత ఉద్యమమని తదనంతర పరిణామాల్లో తెలుసుకున్నారు. అదే ముద్రగడలో రాజకీయంగా పేరు పెట్టారు ఆయన వైసీపీలోకి వెళ్లిన తర్వాత అర్థం అయింది. అయితే ఇప్పుడు కాపులు ఆర్థికపరమైన రిజర్వేషన్లు ఇచ్చిన కొంతవరకు సంతృప్తి పడే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అది నెరవేర్చే ఛాన్స్ కూడా ఏర్పడింది.
* ఈ బీసీ రిజర్వేషన్లు అమలు..
ప్రస్తుతం జరుగుతున్న కాపుల ఆందోళన కార్యక్రమాల్లో ఒక అర్థం ఉంది. దానిని అర్థం చేసుకునే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. గత మాదిరిగా ఈ బీసీ రిజర్వేషన్లు ఇస్తే మిగిలిన సామాజిక వర్గాలను వ్యతిరేకించే అవకాశం లేదు. అయితే గతసారి ఐదు శాతం ఇచ్చారు. ఈసారి మాత్రం 10% ఈ బీసీ రిజర్వేషన్లు ఇవ్వచ్చు. ఆపై నామినేటెడ్ పోస్టులతో పాటు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవుల్లో కాపులకు సింహభాగం ప్రయోజనాలు కల్పించవచ్చు. ఒకవైపు సామాజిక వర్గానికి ఆర్థికపరమైన పథకాలు కూడా అందించవచ్చు. సామాజిక వర్గ నేతలకు రాజకీయంగా పెంచవచ్చు. మరి ఇంతకంటే ఏం చేయగలరు. అయితే వైసీపీలో ఉన్న కాపు నేతలు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెవర్ ఉన్న నేతల ప్రకటనలకు భిన్నంగా.. కూటమిని అలర్ట్ చేసేందుకే ఈ కాపు నేతలు అని స్పష్టమవుతోంది. అయితే దీనిని మేల్కొని కూటమి ప్రభుత్వం కాపుల అభిమానాన్ని చూరగంటే వైసిపి చేసే ప్రయత్నాలు ఏవి ఫలించవు.

