తెలంగాణలో బీఆర్ఎస్ తన ఓట్ల శాతాన్ని కాపాడుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. గత వచ్చిన ఓట్ల శాతం కంటే పెంచడానికి అవసరమైన వ్యూహాలను రచిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు మీకు అనకూల ఓటు పెరుగుతుందని గులాబీ పార్టీ నేతలు. ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. మరొకవైపు బీజేపీ బలపడుతుంది. బీజేపీ తమ ఓటు బ్యాంకును చీల్చకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే కాంగ్రెస్ పై వ్యతిరేక ఓటును తాము రాబట్టుకునే ప్రయత్నంలో కారు పార్టీ ఉంది. పార్టీ అగ్రనేత కేసీఆర్ సూచనల మేరకు కీలక నేతలు ఇప్పటికే ఆ పనిలో నిమగ్నమయ్యారు.
సహజంగా ఏ ప్రభుత్వంలో అధికారం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇంత వ్యతిరేకత ఉంటుంది. పాజటివిటీ కంటే నెగిటివిటీ ఓటు ఎక్కువగా ఉంటుంది. అందుకు కాంగ్రెస్ కూడా మినహాయింపు కాదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ రెండు దఫాల తర్వాత వచ్చిన వ్యతిరేకతతోనే కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే ఎప్పుడూ పదేళ్లు ఒకే పార్టీ అని అనుకోవడం కేవలం ఉండటం కోసమే. ప్రాక్టికల్ గా కుదరదు. మరొకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు బీజేపీ నుంచి కూడా ప్రమాదం పొంచి ఉంది. బీజేపీ ఎంత బలపడితే అంత కాంగ్రెస్ కే నష్టమన్న అంచనాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటు వెళుతుందన్నది పక్కన పెడితే పార్టీలు బలంగా ఓట్లు చీల్చుకుంటే అది తమకే లాభమని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇప్పటికే తమకు క్షేత్రస్థాయిలో మద్దతు వస్తున్నదని అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. కేటీఆర్, హరీశ్ రావులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఇటు క్యాడర్ తో పాటు ఓటు బ్యాంకును కూడా రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తమ పాలనకు, ప్రస్తుత పాలనకు బేరీజు వేసుకుంటే తామే ఎక్కువ ఓట్లు సాధిస్తామని గులాబీ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లోనూ అనేక నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఈసారి ఎన్నికల్లో తమకు అధికారం గ్యారంటీ అన్న ధీమాతో ఉంది. మరి చివరకు ఓటర్లు ఎలా తీర్పు చెబుతారనేది చూడాల్సి ఉంది.

