దృశ్యం 3 OTT విడుదల: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై , సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాలలో ఒకటి ‘దృశ్యం 3’. మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ సినిమాకు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. కానీ ‘దృశ్యం’ సిరీస్ కి మొదటి నుండి ఉన్నటువంటి విపరీతమైన క్రేజ్ కారణంగా , ఈ సినిమా కలెక్షన్స్ అదిరిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి , ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో , ‘దృశ్యం’ సిరీస్ ని కొనసాగించేలా ఆ చిత్ర దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. విడుదలకు ముందే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది.
నాలుగు వారాల థియేట్రికల్ విడుదల తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ చేసుకోవాలి కాబట్టి , ఈ నిన్న అర్థరాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించారు. అయితే ఈ చిత్రం కేవలం మలయాళం , తమిళం మరియు కన్నడ వెర్షన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగులో మాత్రం విడుదల అవ్వలేదు. అందుకు కారణం రైట్స్ డైరెక్టర్ ప్రియా మరియు రాజ్ కుమార్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొనుగోలు చేయడం వల్లే. వీళ్ళు రీసెంట్ హై కోర్టు కి, తమ వద్ద తెలుగు వెర్షన్ రీమేక్ రైట్స్ ఉన్నాయని, దయచేసి ఈ ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్ ని ఆపాలంటూ పిటీషన్ వేశారు. దీని పై విచారణ జరిపిన హైకోర్టు , తెలుగు వెర్షన్ విడుదలని ఆపుతూ నోటీసులు ఇచ్చింది.
ఆ కారణం చేతనే , ఈ చిత్రం కేవలం 3 భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ వెర్షన్ కి కూడా ఇదే సమస్య. అక్కడ ఈ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ రీమేక్ చేస్తున్నాడు. ఆ కారణం చేత ఈ సినిమా హిందీ వెర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో లేదు. ఇది తెలుగు , హిందీ భాషల్లోని దృశ్యం సిరీస్ అభిమానులకు తీవ్రమైన నిరాశే అని చెప్పొచ్చు. తెలుగు లో ఇప్పటికే వెంకటేష్ దృశ్యం రెండు భాగాలను చేశాడు . కానీ మూడవ భాగం లో నటించడానికి ఆయన ఒప్పుకోలేదు. మరి నిర్మాతలు ఈ సమస్యకు చెక్ పెట్టి ఓటీటీ లో తెలుగు వెర్షన్ విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి.

