ప్రభాస్ ఒకే కథతో రెండు సినిమాలు: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించిన రాని గుర్తింపు కొంత మంది స్టార్ హీరోలకు మాత్రం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటిదే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న నటుడు ప్రభాస్ ప్రస్తుతం డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఈ మధ్యనే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన భారీ ఎత్తున సినిమాలనైతే చేస్తున్నాడు. ఇక రాబోయే సినిమాతో తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ప్రభాస్ తన ఎన్టీఆర్ కెరియర్ లో చేసిన చాలా సినిమాలు అతనికి ప్రత్యేకమైన గుర్తింపునిచ్చాయి.
కానీ ఒక రెండు సినిమాలు అతనికి ఏ మాత్రం ఇమేజ్ ను తీసుకురాక పోగా ఆ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. ఇక రెండు సినిమాల కథలు కూడా దాదాపు ఒకే లాగా ఉండటం ప్రేక్షకుడిని అలాగే ప్రభాస్ అభిమానులను సైతం జీర్ణించుకోలేకుండా చేసింది. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటి అంటే ఒకటి యోగి మూవీ కాగా, మరొకటి ఏక్ నిరంజన్ కావడం విశేషం…
ఈ రెండు సినిమాల్లో కూడా హీరో తన ఫ్యామిలీ కోసం తన పేరెంట్స్ కోసం విపరీతంగా సఫర్ అవుతాడు. ఈ సినిమా చివర్లో తన అమ్మని కూడా చూసుకునే అవకాశం పోతుంది. ఈ మూవీలో సైతం తన ఫ్యామిలీ నుంచి విడిపోయి వచ్చిన తర్వాత తన ఫ్యామిలీతో కలిసి అందరు అనుకున్నప్పటికి ఫ్యామిలీతో కలువకుండా తను కూడా సింగిల్ గానే ఉండిపోతాడు. ఈ రెండు సినిమాల క్లైమాక్స్ లు ప్రేక్షకుడిని పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయాయి.
ఓవరాల్ గా సినిమాలు బాగున్నప్పటికి క్లైమాక్స్ విషయంలో తేడా కొట్టడం అలాగే రెండు సినిమాల కథలు కూడా పేరెంట్స్ మీదనే ఉండటం వల్ల ఈ సినిమాలను చూసిన ప్రేక్షకులకు కొంత నిరాశ ఎదురైంది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో చాలా ఎఫెక్టివ్ గా తన నటనని చూపించినప్పటికి అనుకున్న స్థాయిలో సక్సెస్ లను సాధించాడు ఆయన కొంతవరకు డీలాపడ్డాడు…

