Bank Merger Rumors : అప్పట్లో కొన్ని బ్యాంకులు విలీనమయ్యాయి. ఆ తర్వాత ఇంతవరకు మళ్లీ బ్యాంకుల విలీనం సాధ్యం కాలేదు. అప్పట్లో విలీనమైన జాబితాలో ఆంధ్రా బ్యాంకు ఉంది. ఆ బ్యాంకు యూనియన్ బ్యాంకులో విలనమైంది. ఆంధ్రా బ్యాంకులో ఉన్న డిపాజిట్లు.. ఆస్తులు.. ఇతర వ్యవహారాలు యూనియన్ బ్యాంక్‌కి వచ్చాయి.
మళ్లీ ఇప్పుడు కూడా దేశంలో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం అవుతాయంటూ ప్రచారం మొదలైంది. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం అవుతోంది.. కేంద్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపిందని సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం మొదలైంది. ఏదైనా ఉంటే ముందుగానే కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలు చేస్తూనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చెబుతూనే ఉంటారు. కానీ ఈసారి అలాంటిదేమీ లేకుండా ఈ మూడు అతిపెద్ద బ్యాంకులు విలీనం కావడం ఒకరకంగా సంచలనమే. ఇప్పటికిప్పుడు ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నలు కూడా వ్యక్తమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ.. ఇతర ఫైన్స్ భాగాలు ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఈ మూడు బ్యాంకుల విలీనం మీద కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్.. కెనరా బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న సందేశాలు మొత్తం ఫేక్ అని స్పష్టం చేసింది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని పి ఐ బి ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియా వేగంగా ఒక పోస్ట్ చేసింది. బ్యాంకుల విలీనానికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆర్బిఐ వెబ్సైట్లో ఉన్నట్లు.. అనుమానాస్పదంగా ఉన్నట్లు ఎవరైనా మీడియాలో స్ప్రెడ్ చేస్తే 8799 711 259 వాట్స్అప్ నంబర్లు సంప్రదించాలని.. ఒకవేళ ఫ్యాక్ట్ చెక్కి సంబంధించిన సోషల్ మెసేజ్ కూడా సూచించబడుతుంది. అయితే తాజాగా ఇటువంటి నిరాధారమైన సమాచారాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అధికారికంగా ఎస్బిఐ లేదా మిగిలిన బ్యాంకులు దానిపై ప్రకటన చేయలేదు. ఇటువంటి నిరాధారమైన వాటిని స్ప్రెడ్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు చూపుతుంది.
image.png

