ఎంత కీలకమో టిక్కెట్ రుజువు అవుతూనే ఉన్నా.. పెద్ద సినిమాల మేకర్స్ తీరు మారదు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందని.. ఓటీటీల ప్రభావం గట్టిగా పడుతోందని.. టికెట్ల ధరలు, పాప్ కార్న్ రేట్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వాళ్లే స్టేజ్‌ల మీద అంటుంటారు. తీరా చూస్తే మళ్లీ వాళ్లే ఉన్న రెట్ల మీద అదనంగా వడ్డిస్తారు.
ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి చూడాలని ఆశిస్తే కొంచెం పెద్ద సినిమా వచ్చిందంటే చాలు.. వాటికి రేట్లు పెంచుతారు. ‘పెద్ది’ విషయంలోనూ అదే జరిగింది. తెలంగాణలో కోర్టు కేసుల తలనొప్పులున్నా.. కొంత కాలంగా ప్రభుత్వం కూడా రేట్ల పెంపు విషయంలో అంత సానుకూలంగా లేకపోయినా.. పట్టుబట్టి ఈ చిత్రాల రేట్లు పెంచారు. తెలంగాణ మల్టీప్లెక్సుల్లో ఆల్రెడీ టికెట్ల ధరలు ఎక్కువ అన్న అభిప్రాయం ఉంటే.. వాటి మీద అదనంగా రేట్లు పెంచడం పట్ల ప్రేక్షకుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు.
‘పెద్ది’కి లాంగ్ రన్ రాలేదంటే అధిక టికెట్ ధరలు ఒక కారణం అనడంలో సందేహం లేదు. ఈ సినిమా ఆడుతుండగానే సమంత సినిమా ‘మా ఇంటి బంగారం’ ధరలతో థియేటర్లలోకి రావడం, మంచి టాక్ తెచ్చుకోవడంతో ఫ్యామిలీస్ అన్నీ అటు వైపు మళ్లాయి. ‘పెద్ది’ రన్ అర్ధంతరంగా ఆగిపోయింది.
ఐతే ‘పెద్ది’ నామమాత్రంగా నడుస్తున్న ఈ టైంలో ఆ తర్వాత తెలంగాణలో టికెట్ల ధరలు తగ్గించారు. సింగిల్ స్క్రీన్ల రేట్లలో గరిష్ఠ ధరను రూ.105గా పెట్టారు. కానీ ఇదేదో రెండో వీకెండ్ తర్వాత తగ్గించి ఉంటే సినిమాకు కలిసొచ్చేది. రన్ అంతా అయిపోయాక ప్రేక్షకులకు ఏదో వరం ఇస్తున్నట్లు ఇప్పుడు రేట్లు తగ్గించడం మరీ విడ్డూరం.
ఎంత పెద్ద సినిమా అయినా, ఎలాంటి టాక్ తెచ్చుకున్నా సరే.. రెండో వీకెండ్‌ను మించి సినిమా నిలబడడం లేదంటే అధిక టికెట్ ధరలు ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ప్రేక్షకులు కొత్త సినిమా రిలీజైతే చాలా త్వరగా థియేటర్లలో చూడవచ్చు. వాళ్లు చూడాలనుకున్నప్పుడు అధిక రేట్లు ఉంటున్నాయి. తర్వాత రోజుల్లో తగ్గుతుంది కానీ.. ఇంకొన్ని ఓటీటీలో వచ్చేలే అని ఆడియన్స్ అప్పుడు కూడా థియేటర్లకు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ సైకిల్ ఇలాగే కొనసాగిన కాలం.. పెద్ద సినిమాలకు ఆశించిన వసూళ్లు రావడం కష్టమే.

