“ప్లీస్’ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే..టైమ్’ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే..కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా” అంటూ నరసింహనాయుడు సినిమాలో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆయన ఫ్యాన్స్ కు ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. అదే విధంగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన డైలాగ్ బీఆర్ఎస్ కార్యకర్తలకు గూస్ బంప్స్ తెప్పించింది. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధం అంటూ రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను స్వీకరించారు కేటీఆర్.
ఆ విధంగానే ఆ చర్చ జరిగే ప్లేస్, డేట్, టైం, టాపిక్…అన్నీ రేవంత్ ఇష్టం అని కేటీఆర్ ప్రతి సవాల్ చేశారు. ఆ చర్చకు చేతనైతే రేవంత్ వస్తారా…లేకుండా రాహుల్ గాంధీ వస్తారా…మీ ఇష్టం…ఈ సవాల్ కు సిద్ధమా అంటూ కేటీఆర్ చేసిన బస్తీ మే సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ విసిరిన సవాల్ కు తాను రెడీ అని, తమ పార్టీ తరపున తాను చర్చకు వస్తానని కేటీఆర్ చెప్పారు. రేవంత్ చేసేదే చెత్త పాలన అని, దానిపై చర్చ అంటూ సవాల్ విసరడం హాస్యాస్పదమని కేటీఆర్ సెటైర్లు వేశారు.
రైతు డిక్లరేషన్ అంటూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గొప్పలు పోయిన వరంగల్ చౌరస్తాలో చర్చ పెడదామా అని కేటీఆర్ ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలంటూ రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా..తేల్చుకుందామా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి చేతనైతే ఆయన వస్తాడా..లేకుండా రాహుల్ గాంధీ వస్తాడా…ఎవడొస్తడో రండి..అని ఛాలెంజ్ చేశారు.
ఒకవేళ ఆ చర్చలలో సంభవించిన వాటితో సహా వారి తప్పులను బయటపెట్టకపోతే, వారి పరిపాలనా వైఫల్యాన్ని అశోక్ నగర్, వరంగల్ చౌరస్తాలో నగ్నంగా నిలబెట్టకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈ సవాల్ కు సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించారు. మరి, కేటీఆర్ ప్రతి సవాల్ ను స్వీకరించి రేవంత్ చర్చకు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ కామెంట్స్ కు రేవంత్ కౌంటర్ ఏ విధంగా ఉండబోతోందో చూడాలి. ఏది ఏమైనా రేవంత్, ల బస్తీ మే సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా కేటీఆర్ మారింది.

