Mohan Babu vs Rajasekhar: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి నటులు ఇండస్ట్రీకి నాలుగు పిల్లర్లుగా ఉండేవారు… వీళ్లను ప్రేక్షకులు ఆదరించడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు వీళ్ళ అభిమానులుగా మారిపోయారు. ఇక ఇలాంటిదే వీళ్లతో పాటు మోహన్ బాబు, రాజశేఖర్ నటులు కూడా హీరోలుగా రాణిస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. నిజానికి మోహన్ బాబు రాజశేఖర్ ల మార్కెట్ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయింది. వాళ్ళతో సినిమాలు చేసే రేంజ్ లో ఎవరు లేరు. కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కానీ, విలన్స్ గా వాళ్ళను వాళ్లు ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే మోహన్ బాబు సెకండ్ స్టార్ట్ చేశాడు. ‘ప్యారడైజ్’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే మహేష్ బాబు వాళ్ళ అన్న కొడుకు అయిన జయకృష్ణ హీరోగా వస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక వీటితోపాటుగా సినిమాలకు కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్ నితిన్ హీరోగా వచ్చిన ‘ఎస్ట్రాడినరీ మ్యాన్’ అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అతనికి గుర్తింపు రాలేదు. ఇక శర్వానంద్ హీరోగా చేసిన ‘బైకర్’ సినిమాలో కూడా హీరో ఫాదర్ క్యారెక్టర్లో నటించాడు. ఆ సినిమాలో అతని క్యారెక్టర్ కి మంచి గుర్తింపు లభించినప్పటికి సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించాడు. ఇక ఏది ఏమైనా కూడా రాజశేఖర్ నుంచి వచ్చే సినిమాల విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి.
తన క్యారెక్టర్‌ను ఆచి తూచి చూస్తున్నాడు కూడా సక్సెస్ ని సాధిస్తేనే అతనికి గొప్ప గుర్తుపైతే వస్తుంది లేకపోతే కష్టమనే చెప్పాలి. మోహన్ బాబు రాజశేఖర్ ఇద్దరిలో ఎవరు మంచి నటుడు వాళ్ళిద్దరిలో ఎవరి సినిమాలో తీసుకుంటే ఆ సినిమాకి ఇంపాక్ట్ పెరుగుతుంది అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి వీళ్ళిద్దరు కూడా మంచి నటులే అయినప్పటికి మంచి పాత్ర దొరికితేనే వాళ్ళు ఎలివేట్ చేసుకోగలుగుతారు లేకపోతే చాలావరకు డౌన్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇక సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మీద చాలా రకాల చర్చలైతే నడుస్తున్నాయి.
వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అని కొందరు కొన్ని ప్రశ్నలు అడిగితే కొంతమంది మోహన్ బాబు మంచి నటుడు అని చెబుతుంటే మరి కొంత మంది మాత్రం రాజశేఖర్ గొప్ప నటుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇద్దరు మంచి నటులే అయినప్పటికి వీళ్లిద్దరూ కూడా చాలా వరకు కాంట్రవర్సీలో ఇరుక్కోవడం వల్ల వాళ్ల సినిమా కెరియర్ ను కోల్పోయారు…

