ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ, కలెక్టర్, డీ గ్రామీణ పాఠశాల జూన్ 22వ తేదీ నాటికి మండల పరిధిలోని ప్రభుత్వాలకు, పట్టణంలోని పాఠశాలలకు పూర్తి స్థాయి పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశామని. అనంతరం వారు మాట్లాడుతూ ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలో నూతనంగా విద్యార్థులకు చేరిన విద్యార్థులకు జూలై మాసాంతం లోపు పాఠ్యపుస్తకాలు వచ్చిన వెంటనే పంపిణీ చేసినట్లు తెలిపారు. రూరల్, పట్టణం లోని 75 ప్రాథమిక పాటశాలల్లో 15,112 పుస్తకాలు, అదేవిధంగా యూపీ స్కూల్ అనగా ఆరవ తరగతి నుండి 8వ తరగతి వరకు గల 25 పాఠశాలల్లో 23,469 పాఠ్యపుస్తకాలు, 9వ, పదవ తరగతి గల 20 పాఠశాలల్లో 13,457 పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. పాత విద్యార్థులు తప్ప, కొత్తగా చేరిన వారికి ఇంకను ప్రభుత్వము నుంచి పాఠ్యపుస్తకాలు రాలేదని, ఇండెంట్ పెట్టడం మొత్తం జరిగిందని వారు స్పష్టం చేశారు. కావున తల్లిదండ్రులు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గమనించాలని తెలిపారు.

