తెలంగాణ:బీఆర్ఎస్తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన ముఖ్యమంత్రి మరోసారి పారిపోయారు.సందట్లో సడేమియా అన్నట్టు మంత్రి జూపల్లి వస్తానని చెప్పి ఆయన కూడా తోక ముడిచారు.
మేమంతా ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్కు వచ్చి కూర్చున్నాము.మీరు చేసిన అవినీతి మీద,అప్పుల మీద బీఆర్ఎస్తో చర్చ అంటే ఇంత భయం ఎందుకు ? చేతకాని వాళ్లు ఎందుకు సవాళ్లు చేయాలి? కాంగ్రెస్ మంత్రులు చర్చకు వస్తే రాష్ట్ర ప్రజల ముందు అన్ని వాస్తవాలు ఉంచుతామని అనుకున్నాం.సవాళ్లు స్వీకరించే సత్తా ముఖ్యమంత్రి,మంత్రులకు లేదని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

