ప్రిక్వార్టర్ ఫైనల్లో అమెరికా
సెనెగల్, బోస్నియా ఇంటికి, ఫిఫా వరల్డ్ కప్
సియాటెల్: ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం, అమెరికా జట్లు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాయి. సెనెగల్‌తో జరిగిన హోరాహోరీ సమరంలో బెల్జియం21 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఇక బోస్నియాతో జరిగిన మరో మ్యాచ్‌లో ఆతిథ్య జట్లలో ఒకటైన అమెరికా 20 గోల్స్ తేడాతో జయకేతనం ఎగుర వేసింది. బోస్నియా, అమెరికా జట్ల మధ్య జరిగిన రౌండ్32 మ్యాచ్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. రెండు జట్లు కూడా గోల్స్ కోసం సర్వం ఒడ్డాయి. ఒక సమయంలో బోస్నియా దూకుడైన ఆటతో అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేసింది. కానీ అమెరికా సయితం ఎదురుదాడికి గోల్ కోసం హోరాహోరీగా పోరాడింది. 45వ నిమిషంలో అమెరికా శ్రమ ఫలించింది. ఫోలరిన్ బాలోగన్ ఈ గోల్ సాధించాడు. దీంతో ప్రథమార్ధంలో ఆతిథ్య జట్టు 10 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత కూడా అమెరికా జోరును కొనసాగించింది.
అయితే చాలా సేపటి వరకు గోల్ మాత్రం సాధించలేక పోయింది. ఇక బోస్నియా కూడా స్కోరును సమం చేసేందుకు భీకరంగా పోరాడింది. అయితే పటిష్టమైన అమెరికా డిఫెన్స్ ముందు బోస్నియా గోల్ ప్రయత్నాలు ఫలించలేదు. ఇక 82వ నిమిషంలో మాలిక్ టిల్మన్ అమెరికాకు రెండో గోల్‌ను అందించాడు. కాగా, 64వ నిమిషంలో ఫోలరిన్ రెడ్ కార్డ్‌కు గురై మైదానం నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. కాగా, చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడు కోవడంలో సఫలమైన అమెరికా అద్భుత విజయంతో ముందంజ వేసింది.
సెనెగల్‌కు చెక్
హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో బెల్జియం 32 గోల్స్ తేడాతో సెనెగల్‌ను ఓడించింది. ఆరంభంలో సెనెగల్ అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. బెల్జియంను హడలెత్తిస్తూ లక్షం దిశగా సాగింది. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే సమయంలో హబీబ్ 24వ నిమిషంలో సెనెగల్‌కు తొలి గోల్‌ను అందించాడు. ప్రథమార్ధంలో సెనె్న 10 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధం ఆరంభంలో కూడా సెనెగల్ అద్భుత ఆటతో అలరించింది. ఇక 51వ నిమిషంలో ఇస్మాయిలా సెనెగల్‌కు మరో గోల్ సాధించి పెట్టాడు. ఆ తర్వాత బెల్జియం అనూహ్యంగా పుంజుకుంది. సెనెగల్ గోల్ పోస్ట్ వైపు వరుస దాడులు చేస్తూ గోల్స్ కోసం ప్రయత్నించింది. ఇక 86వ నిమిషంలో రొమెలు రొకాకు బెల్జియంకు తొలి అందించాడు. అంతేగాక 89వ నిమిషంలో యౌరి టిలెమాన్స్ బెల్జియం రెండో గోల్ నమోదు చేశాడు. దీంతో నిర్ణీత సమయంలో స్కోరు 22తో సమమైంది. అయితే అదనపు సమయంలో యౌరి మరో గోల్ నమోదు చేయడంతో బెల్జియం చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో ప్రిక్వార్టర్ బెర్త్‌ను దక్కించుకుంది.

