- సాలిడ్ వెస్ట్ మేనే జ్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్లోని 86 ఎకరాల భూమిలో జీహెచ్ఈఏపీ సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్(ఎస్ డబ్ల్యూఎం) కేంద్రం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో 641ను జారీ చేసింది.
సర్వే నంబర్లు 252, 278, 361లోని 86 ఎకరాల భూమిని ఎకో-టౌన్ ప్రాజెక్టు కోసం జీహెచ్ఈకి బదిలీ చేశారు. జపాన్ లోని కిటాక్యూషూ నగరం– రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన సహకార ఒప్పందంలో భాగంగా ఈ ఎకో-టౌన్ అభివృద్ధి చేయనున్నారు.

