హైదరాబాద్: 2006, జూలై 4న జెడ్పీటీసీగా మిడ్జిల్ మండల ప్రజలు నన్ను ఆశీర్వదించారు.. ఆ రోజు మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క నేడు మహావృక్షమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నా రాజకీయ ప్రస్థానంలో కీలకమైన మిడ్జిల్ ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటానన్నారు. శనివారం (జూలై 4) మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.
మిడ్చిల్ జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై 20 ఏళ్లు అవుతున్నందున స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. నా నియోజకవర్గం, మండలం కాకపోయిన తనను జెడ్పీటీసీగా గెలిపించిన మిడ్జిల్ మండలానికి కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత తనపై జరిగింది. మిడ్జిల్ ప్రజలు నాపై పెట్టిన నమ్మకంతోనే ఈస్థాయికి చేరుకున్నట్లు తెలిపారు.
మిడ్జిల్ మండలాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరుతున్నానని అన్నారు. మిడ్జిల్ డార్క్ మండల కాదు.. వెలుగు రేఖ అని నిరూపించాలన్నారు. 2006లో జెడ్పీటీసీగా తనపై పోటీ చేసిన రబ్బానీకి ప్రభుత్వ పదవి ఇస్తామని చెప్పారు. పేదల మధ్య పెరిగిన తనకు పేదల కష్టాలు, సమస్యలు తెలుసని అన్నారు. కానీ దొరలకు గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన లేదు. అన్ని గ్రామాల్లో సమస్యలు పరిష్కారమైతే దేశం అభివృద్ధి చెందుతుంది.

