వైభవ్ అరంగేట్రం : వరల్డ్ కప్ హీరో అన్నారు.. బీభత్సంగా పరుగులు చేశాడు. మ్యాచ్ విన్నర్ కాబట్టి అవకాశాలు ఇస్తున్నామని చెప్పారు. కానీ అతడు ఏ దానిని కూడా సద్వినియోగం చేసుకోవడం లేదు. గల్లి స్థాయిలో ఆడుతూ టీమ్ ఇండియా పరువు తీస్తున్నాడు. దీంతో అతడికి సేవలు చాలనుకుని మేనేజ్మెంట్ భావించింది. అంతేకాదు మొహమాటం లేకుండా పక్కన పెట్టింది. ఇదీ జాబితాలో సంజు శాంసన్ పరిస్థితి.
రకరకాల ఒత్తిళ్లు.. అనేక రకాల విమర్శలు.. ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ను పునరాలోచనలో పడేశాయి. ఫలితంగా రెండవ టి20 మ్యాచ్ కు సంజుకు విశ్రాంతి లభించింది. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో బుడ్డబెబ్బులి అలియాస్ వైభవ్ సూర్య వంశీ ఎంట్రీ గ్రాండ్ గా జరిగింది. సూర్యవంశీ జట్టులోకి వచ్చిన తర్వాత పరిస్థితి అమాంతం మారిపోయింది. ఎంతలా అది మారిపోయింది అంటే.. గడిచిన మూడు మ్యాచ్‌లలో తొలి వికెట్ భాగస్వామ్యం కనీసం 10 కూడా రాలేదు. అలాంటిది జట్టుతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఈ కథనం రాసే సమయం వరకు తొలి వికెట్ కు 55 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో సూర్య వంశీ 14 పరుగులు మాత్రమే చేసి ఉండవచ్చు. కానీ అతడు ఇచ్చిన సపోర్ట్ టీమిడియాకు ఎంతగానో లాభించింది. పది బంతులు ఎదుర్కొన్న అతడు రెండు సిక్సర్లు. ఇది అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్.
సూర్య వంశీకి స్థానం కల్పించాలని ఎప్పటినుంచో డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ ప్లేయర్ల నుంచి మొదలు పెడితే మాజీ ప్లేయర్ల వరకు అందరూ సూర్య వంశీ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. అతనికి అవకాశం లభిస్తుంది. నిర్వహణ మీద తీవ్ర ఒత్తిడి రావడంతో చోటు కల్పించింది. వచ్చిన దానికి అతడు దాదాపుగా సద్వినియోగం చేసుకున్నాడు. సంజు శాంసన్ దారుణంగా విఫలమవుతున్న చోట. అతడు తొలి వికెట్ కు అభిషేక్ శర్మతో కలిసి 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సూర్యవంశీ వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ ప్రమాదకరమైన బౌలింగ్ ఉంది. ఉన్నంతసేపు ఇంగ్లాండు ఫీల్డర్లకు.. బౌలర్లకు చెమట పట్టించాడు. అందువల్లే అభిషేక్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలిగాడు.
క్రేజీస్ట్ షాట్ – అంతర్జాతీయ క్రికెట్లో మొదటి ఆరు
వైభవ్ సూర్యవంశీ వచ్చారు.pic.twitter.com/GLigi5WG2M
– జాన్స్. (@CricCrazyJohns) జూలై 4, 2026
అభిషేక్ శర్మ ఇప్పటివరకు 22 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక శిక్ష సహాయంతో 43 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న అతడు కరణ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఇప్పటికే 6ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతోంది. ఇండియా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదేనని ఓపెనర్లు నిరూపించారు. బుడ్డ బెబ్బులి అలియాస్ సూర్య వంశీ జాతీయ జట్టులో అడుగుపెట్టి.. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా మొత్తం అతని పేరును కలవరపెడుతోంది. సూర్య వంశీ నామస్మరణతో మారు మోగిపోతుంది.
ది హిస్టారిక్ మూమెంట్. ❤️
– వైభవ్ సూర్యవంశీ, భారత క్యాప్‌ను అందుకున్న అతి పిన్న వయస్కుడు. pic.twitter.com/OR8Q9cCuwC
— ముఫద్దల్ వోహ్రా (@mufaddal_vohra) జూలై 4, 2026

