విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా వినోద్ గాలి దర్శకత్వంలో శరత్ చంద్ర నాయుడు నిర్మించిన సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. రోహిణి హట్టంగడి, శివ నారాయణ, ప్రియదర్శిని రామ్, గోపరాజు రమణ, అనీష్ కురువిల్లా ఇతర పాత్రలు పోషించిన ఈ సిరీస్ ప్రస్తుతం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి మంచి స్పందన వస్తోందని శనివారం టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ ‘ఈ సిరీస్కు వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.
అందరూ ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. ఈ సిరీస్లో తన పాత్రకు మంచి పేరు రావడం హ్యాపీ అని యశశ్రీ చెప్పింది. తమ సిరీస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని దర్శకుడు వినోద్ చెప్పాడు. నిర్మాత శరత్చంద్ర నాయుడు మాట్లాడుతూ ‘విరాజ్ పెర్ఫార్మెన్స్, చివరి రెండు ఎపిసోడ్స్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు.
అల్లు అర్జున్ గారు సిరీస్ చూసి ట్వీట్ చేయడం సంతోషంగా అనిపించింది’ అని అన్నారు. ఈటీవీ విన్ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ భరణ్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేష్, రైటర్ రాజశేఖర్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ సహా టీమ్ అంతా ఉంది.

