బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ 61 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి పెళ్లికొడుకు అయ్యారు. కొన్నేళ్ల నుంచి ఆయన రిలేషన్షిప్లో ఉన్న గౌరీ స్ప్రాట్‌ను ఆదివారం ముంబయిలోని తన నివాసంలో అమీర్ పెళ్లి చేసుకున్నారు. పెద్ద ‘హ’డావుడి లేకుండా.. తక్కువ’మంది కుటుంబ స’భ్యులు, ప్రముఖ మధ్య అమీర్, గౌరీల పెళ్లి జరిగింది.
సంప్రదాయ పద్దతిలో కాకుండా.. సింపుల్‌గా ఈ వివాహాన్ని ముగించారు. పెళ్లికి సంబంధించి అధికారిక పత్రాలపై ఇద్దరూ సంతకాలు చేయడం ద్వారా అమీర్, గౌరీ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.
అమీర్ ఇద్దరు తనయులు జునైద్ ఖాన్ (రీనా దత్తాతో కలిగిన సంతానం), ఆజాద్ రావ్ ఖాన్ (కిరణ్ రావుతో కలిగిన కొడుకు).. గౌరీ తనయుడు.. అమీర్, రీనాల తనయురాలు ఇరా ఖాన్ల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు కాకుండా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో పాటు కొందరు వేడుకలు మాత్రమే అమీర్ వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అమీర్ టీం సోషల్ మీడియాలో పంచుకుంది.
అమీర్ తొలిసారిగా 1986లో తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి 2002లో విడిపోయిన అమీర్.. తనతో కలిసి కొన్ని సినిమాలకు పని చేసిన కిరణ్ రావును 2005లో పెళ్లాడాడు. పెళ్లి తర్వాత కూడా ఈ ఇద్దరూ పలు చిత్రాలకు కలిసి పని చేశారు. ఈ జంట 2021లో విడిపోయింది. తర్వాత కొన్నేళ్లు ఒంటరిగా ఉన్న అమీర్.. చాలా ఏళ్ల నుంచి తనకు స్నేహం ఉన్న గౌరీ స్ప్రాట్‌తో మూడేళ్లకు ముందు రిలేషన్‌షిప్‌లోకి వెళ్లాడు.
గత ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా గౌరీతో తన బంధం గురించి మీడియాకు వెల్లడించిన అమీర్.. ఇప్పుడు ఆమెతో వివాహ బంధంలోకి వెళ్లాడు. తన మాజీ భార్యలిద్దరితోనూ అమీర్‌కు ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల అమీర్, గౌరీ, రీనా, కిరణ్ కలిసి ఒకే కారులో ప్రయాణించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అమీర్, గౌరీ పెళ్లికి కూడా ఈ ఇద్దరూ హాజరవుతారని వార్తలు రాగా.. ఇంకా సంబంధిత ఫొటోలేవీ సోషల్ మీడియాలోకి రాలేదు.

