– ప్రకటన –
నవతెలంగాణ – జుక్కల్
సావర్ గావ్ తాండ గ్రామంలో సోమవారం అంగన్వాడి టీచర్ బుజ్జి బాయ్ ఆధ్వర్యంలో అన్నప్రాసన, పిల్లలకు వైద్య పరీక్షలు, పౌష్టికాహారం అందజేశామని జిపి కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిపి కార్యవర్గ సభ్యులు ఉన్నారు. గర్భిణీలకు , బాలింతలకు , పౌష్టికాహారం తీసుకోవడం ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన పోషక పదార్థాలు అంగన్వాడీలో లభిస్తాయని తెలిపారు. అదేవిధంగా గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమము జరిగింది. అనంతరం చిన్నారుల ఎత్తు, బరువు పరీక్షించారు. అదేవిధంగా పౌష్టికాహారం బాలామృతం ప్యాకెట్లు బాలింతలకు , గర్భిణీలకు, పిల్లలకు , ప్రదేశం. అనంతరం గ్రామంలో అర్హులైన చిన్నారులకు అంగన్వాడి కేంద్రం లో చేర్చాలని కోరుతూ ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు వార్డు సభ్యులు పరశురాం , బాలాజీ , అంగన్వాడీ టీచర్ , ఆశ కార్యకర్త, నిర్వహించారు.
– ప్రకటన –

