ఏఐఎస్బీ రాష్ట్ర కార్యదర్శి పోతులయ్య
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని మిర్చి పాఠశాల యుడైస్ కోడ్ లేకుండా బోగస్ పాఠశాల పెట్టుకుని విచ్చలవిడిగా అడ్మిషన్లు కోరుతూ డీఈఓ కిష్టప్పకు వినతి పత్రాన్ని రఘువీరా కోరుతూ డీఈఓ కిష్టప్పకు వినతి పత్రాన్ని ఏఐఎస్బీ రాష్ట్ర కార్యదర్శి పోతులయ్య, ఐఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ యాదవ్ ప్రకటించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని రఘు మేడ్జ్ పాఠశాల యాజమాన్యం వారు కేవలం పాఠశాల ఓపెనింగ్ పర్మిషన్ మాత్రమే వచ్చినప్పటికీ రఘు మేడ్జ్ పాఠశాల యాజమాన్యం వారు ఇష్టానుసారంగా అడ్మిషన్లు నిర్వహిస్తూ పాఠశాలను నడుపుతున్న వీళ్లు పూర్తిగా ప్రభుత్వం వ్యతిరేకంగా నడుపుతున్నప్పటికీ బోగస్ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఇలా బోగస్ స్కూల్ నడపడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపారు. ఉదాహరణకు ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం గత సంవత్సరంలో ఫొనెక్స్ గ్లోబల్ స్కూల్ యుడైస్ కోడ్ లేకుండా బోగస్ పాఠశాల నడిపి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించారు. అలాగే ఈ రఘు మేడ్జ్ పాఠశాల వారు కూడా అదే తంతు కొనసాగుతున్నారు అదేవిధంగా వేల రూపాయలకి పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ యుడైస్ కోడ్ లేకుండా పాఠశాల నడుపుతున్నటువంటి రఘు మేడ్ స్కూల్ ను వెంటనే సీజ్ చేయాల్సిన విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము అని తెలియచేశారు.

