భారత్ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కృషికి గుర్తింపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటా ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్ ఆఫ్ ఇండోనేషియాను ప్రదానం చేశారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మంగళవారం జకార్తాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రధాని మోదీకి ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని కార్యాలయం ఎక్స్‌గా వేదిక సూచనూ, ఇండోనేషియా అత్యున్నత గౌరవాన్ని ఎంతో ఆప్యాయతతో నాకు ప్రకటించారు. ఈ పురస్కారం 140 కోట్ల భారతీయులందరికీ చెందింది. అలాగే భారత్ ఇండోనేషియా దేశాల మధ్య ఉన్న చారిత్రక, సన్నిహిత సంబంధాలకు ప్రతీక అని. ఈ గౌరవానికి అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకి, ఇండోనేషియా ప్రభుత్వం, అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ పురస్కారం భారత్ ఇండోనేషియా స్నేహబంధానికి ప్రతీక అని పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య స్నేహాన్ని బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ నాయకత్వానికి అలాగే, ఇండోనేషియా ఐక్యత, అభివృద్ధి, నిరంతర ప్రగతికి చేసిన విశేష కృషిని గుర్తించి ఈ అవార్డును అందించారు. ప్రధాని ఈ గౌరవాన్ని భారత ప్రజలకు, ఇరు దేశాల మధ్య చిరకాల స్నేహబంధానికి అంకితం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఈ సందర్భంగా తెలియజేసారు, భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో, అలాగే భారత్ఆసియా దేశాల సంబంధాలను విస్తరించడంలో ప్రధాని మోదీ చేసిన కృషికి ఈ పురస్కారం నిదర్శనమని పేర్కొన్నారు. ఈ గౌరవం ప్రతి భారతీయుడికీ గర్వకారణమని ఆయన అన్నారు.1959లో ప్రవేశపెట్టిన బింటాంగ్ ఆదిపూర్ణ పురస్కారం ఇండోనేషియా అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది. ఇండోనేషియా ఐక్యత, స్థిరత్వం, అభివృద్ధికి విశేష సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

