Nikhil Siddhartha : ప్రముఖ యంగ్ హీరో నిఖిల్ార్థ్ అప్పుడప్పుడు తన శక్తి కి తగ్గట్టు సేవా కార్యక్రమాలు చేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. రాజకీయ నేపథ్యం ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఏ రోజు కూడా తన మావయ్య పేరును ఉపయోగించుకోలేదు , కేవలం తన వ్యక్తిగతంగా సహాయ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గానే ఆయన భీమవరం లో ఒక గొప్ప శ్రీకారం చుట్టారు. భీమవరం విద్యావ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో వెయ్యి మంది విద్యార్థులకు ఆయన సామగ్రి అందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. నిఖిల్ చేసిన ఈ గొప్ప పనిపై నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మన జీవితంలో విద్యనే భవిష్యత్తును మార్చగల ఏకైక శక్తి. విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలి. తల్లిదండ్రులను , గురువులను గౌరవించాలి. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు కూడా ఈ కిట్స్ అందించడమే నా లక్ష్యం’ అంటూ నిఖిల్ సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాజీఫా వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నియోజకవర్గాల్లో భీమవరం కూడా ఒకటి. అలాంటి చోట ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమం చేసినందుకు పవన్ ఫ్యాన్స్ కూడా నిఖిల్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. విషయాల్లో మా సపోర్టు ఎప్పుడూ ఇలాంటిదేనని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నారు. ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘స్వయంభు’ అనే సోషియో ఫాంటసీ చిత్రం చేస్తున్నారు. నభ నటేష్ , సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై ఆయన భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. నిఖిల్ గత చిత్రం ‘స్పై’ ఆశించిన స్థాయి ఫలితాన్ని సొంతం చేసుకోలేక పోయింది. ‘కార్తికేయ 2’ తో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ ని అందుకున్నాడు ఆయన , ‘స్వయంభు’ తో మరోసారి తన సత్తా చాటుతారో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటు ఆయన ‘ఇండియా హౌస్’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత.
భీమవరంలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ భారీ సేవా కార్యక్రమం!
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ!
వెయ్యి మంది విద్యార్థులకు విద్యాసామగ్రి అందజేసిన హీరో నిఖిల్!
విద్యే భవిష్యత్తును మార్చగల ఏకైక శక్తి” – హీరో నిఖిల్
విద్యార్థులంతా ఉన్నత స్థాయికి… pic.twitter.com/SFMs4S9xI1
— NTV బ్రేకింగ్ న్యూస్ (@NTVJustIn) జూలై 7, 2026

