తమిళనాడు సీఎం విజయ్ జన నాయకుడు సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు తెరమీద డ్రామా కన్నా గొప్పగా పండుతున్నాయి. మొన్నెవరో ఏ సర్టిఫికెట్ వచ్చిందో. జూలై 23 విడుదలంటూ పోస్టర్లు కూడా తయారు చేశారు. కట్ చేస్తే నిర్మాణ సంస్థ అదేం లేదని కొట్టి పారేస్తోంది. సెన్సార్ నుంచి క్లియరెన్స్ రాగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అప్పటిదాకా వేచి చూడమని చెబుతోంది. ఇక్కడితో అయిపోతే ట్విస్టులు ఏముంటాయి.
జన నాయకుడు ఎప్పుడు విడుదలైనా, బెనిఫిట్ షో మొదలుపెట్టి ఏ రోజైనా దీని టికెట్లు సాధారణ ధరకే అమ్మాలని, బ్లాక్లో ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లకు చట్టప్రకారం శిక్ష విధించాలని, విజయ్ చెప్పినట్టు వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు రెగ్యులర్ షోలు టీవీకే పార్టీ వేసినా సరే రేట్లు ఇచ్చే సమస్యే ఉందట. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఈ ఆయుధంగా వాడుకోవడానికి అవకాశం ఇవ్వకుండా చేసే ప్లానట.
ఇందులో నిజమెంతుందో కానీ ఎక్స్ తదితర మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇంకోవైపు డిస్ట్రిబ్యూటర్లకు జూలై 23 విడుదల గురించి పక్కా సమాచారం ఉందని అందుకే ఇతర నిర్మాతలు ఎవరూ ఆ డేట్ కి వచ్చేందుకు సాహసం చేసే ఆలోచనలో లేరని ఇంకో న్యూస్ షికారు చేసింది. ఈ సినిమా పైరసీ హెచ్డి ప్రింట్ కేసు కోర్టులో జరుగుతున్న సంగతి తెలిసిందే. కోటికి పైగా ప్రేక్షకులు ఈ సినిమా చూసేశారని కెవిఎన్ తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.
ఏది ఎలా ఉన్నా ఫ్యాన్స్ మాత్రం త్వరగా విడుదల చేయమని మొరపెట్టుకుంటున్నారు. తమ హీరో ముఖ్యమంత్రి అయ్యాక కూడా సినిమా ఇంత ఆలస్యం కావడం పట్ల వాళ్లలో అసహనం. నటుడిగా ఇదే తన చివరి చిత్రంగా విజయ్ ఎన్నికలకు ముందు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఇంకో మూవీ వచ్చే ఛాన్స్ లేదు. రజనీకాంత్, కమల్ హాసన్ లాగా పాలిటిక్స్ లో తడబడి ఉంటే ఏమయ్యేదో కానీ గెలిచేశారు కాబట్టి మేకప్ వేసుకునే అవకాశం రాదు.

