మహారాష్ట్ర : మహారాష్ట్రలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి
మహారాష్ట్ర: మహారాష్ట్రలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాసిక్ లో గోదావరి పరవళ్లు తొక్కుతుంది. రెండు రోజుల క్రితం పుణెలో వానలు దంచికొట్టగా, నిన్నటి నుంచి నాసిక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో గోదావరి జన్మస్థానమైన అక్కడ నది పరవళ్లు తొక్కుతోంది.
రాకపోకలు నిలిచిపోవడంతో…
నాసిక్-త్రయంబకేశ్వర్ రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల నదులు ఉప్పొంగి ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు నియమించారు. ఎవరూ నదిని దాటే ప్రయత్నం చేయకూడదని, అలాగే గోదావరిలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
వార్తల సారాంశం – మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి

