ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మకు విషపురుగు కరిచింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన పీఏ సుభాశిష్ పాండా ఒక వీడియో విడుదల చేశారు. రాజేష్ శర్మకు ఎలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదని ఆయన, రాజేష్ శర్మకు ఉన్న షుగర్ వల్ల కాలు కొద్దిగా వాచిందని, అందుకే హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని, ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ కూడారని సుభాషిష్ చెప్పారు.
రాజేష్ శర్మకు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తుండగా ఏదో అయ్యిందని సోషల్ మీడియాలో, కొన్ని మీడియా ఛానల్స్ లో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అబద్ధమని సుభాశిష్ పాండా స్పష్టం చేశారు. రాజేష్ శర్మ ఎక్కడికి వెళ్లినా ఆయనతో పాటు తాను ఉంటానని, హైదరాబాద్‌లో అలా ఏమీ జరగలేదని, కొందరు తమ స్వార్థం కోసం ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేశారని ఆయన చెప్పారు. దయచేసి ఇలాంటి నిజానిజాలు తెలియని ఫేక్ న్యూస్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేయవద్దు సుభాశిష్ పాండా గురించి.

