Black Chickpeas : మనం తీసుకునే అత్యంత పోషకాహారంలో నల్ల శనగలు (Black Chickpeas/Kala Chana) ఒకటి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండటంతో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయి. ముఖ్యంగా బరువు తగ్గేవారు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు తమ ఆహారంలో నల్ల శనగలను చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు పొందాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నల్ల శనగల్లో ఫైబర్ అధికంగా ఉండటంతో ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. దీనితో అనవసరంగా ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం తగ్గుతుంది. తక్కువ బరువుతో ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించి బరువు నియంత్రణకు దోహదపడుతుంది.నల్ల శనగల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచకుండా నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు పరిమిత మోతాదులో తీసుకోవచ్చు.
వీటిలో ఉండే ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటు నియంత్రణకు తోడ్పడి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న కండరాల నిర్మాణం, దెబ్బతిన్న కణజాలం పునరుద్ధరణకు నల్ల శనగలు ఉపయోగపడతాయి. వ్యాయామం చేసే వారికి ఇవి మంచి సహజ ప్రోటీన్ ఆహారం. అధిక ఫైబర్ కారణంగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మలబద్ధకం సమస్య తగ్గి పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నల్ల శనగల్లో ఐరన్, జింక్, ఫోలెట్ వంటి శక్తి పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం మెరుగుపడుతుంది.ఐరన్ అధికంగా ఉండటంతో హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో మెరుగుపడుతుంది. ముఖ్యంగా మహిళలు, యువతులు వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
రాత్రంతా నల్ల శనగలను నీటిలో నానబెట్టి ఉదయం సలాడ్‌గా తినవచ్చు.మొలకెత్తించి తీసుకుంటే పోషక విలువలు మరింత పెరుగుతాయి.కూర, సుందల్, చాట్ లేదా కర్రీ రూపంలో కూడా వండుకుని తినవచ్చు.సూప్‌లు, పులావ్‌లలో కూడా కలిపి ఉపయోగించవచ్చు.

